Afghanistan Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం (earthquake in Afghanistan) సంభవించింది. రిక్టర్ స్కేలు 5.3 తీవ్రత నమోదయినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. సోమవారం జరిగిన ఈ ఘటనసలో 26 మంది మరణించారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. ఈ భూకంపం పశ్చిమ ప్రావిన్స్ బాద్గీస్‌లోని ఖాదీస్ జిల్లాలో (Qadis district)చోటుచేసుకుంది.
ఇళ్ల పైకప్పులు కూలిపోవడం వల్లే బాధితులు మరణించారని ప్రావీన్స్ ప్రతినిధి బాజ్ మహ్మద్ సర్వారీ (Baz Mohammad Sarwary) తెలిపారు. చాలామంది గాయపడ్డారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. కాగా ముఖ్ర్ జిల్లాలో (Muqr district) కూడా భూకంపం సంభవించిందని అయితే అక్కడ జరిగిన ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని సర్వారీ చెప్పుకొచ్చారు.
Also Read: Tonga Island Tsunami: పసిఫిక్ లో అగ్నిపర్వతం విస్ఫోటనం.. టోంగా ద్వీపాన్ని తాకిన సునామి!
ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికే మానవతా విపత్తులో (humanitarian disaster) చిక్కుకుంది, ఆగస్టులో దేశాన్ని తాలిబాన్ స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఆ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. అంతార్జాతీయ సహాయం ఆగిపోవడంతో...అక్కడి పరిస్థితి మరింత దిగజారింది. తినడానికి తిండి కూడా దొరకడం లేదు. ఈ పరిస్థితుల్లో భూకంపంతో మరింత నష్టం వాటిల్లింది.
హిందూకుష్ పర్వత శ్రేణుల (Hindu Kush mountain range) కారణంగా అఫ్గాన్ లో తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి. దీనికి తోడు ఇక్కడి ప్రజలు నిర్మించుకున్న గృహాలు, భవనాల కారణంగా మృతుల సంఖ్య బాగా పెరుగుతోంది. 2015లో 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా సుమారు 280 మంది మృత్యువాత పడ్డారు. ఈ భూకంపం ధాటికి అత్యధిక మరణాలు పాకిస్తాన్‌లో చోటుచేసుకున్నాయి. ఆ విపత్తులో పాఠశాల భవనం నుండి పారిపోవడానికి ప్రయత్నించిన 12 మంది ఆఫ్ఘన్ యువతులు తొక్కిసలాటలో నలిగి చనిపోయారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook