Telugu Scientist: నకిలీ పరిశోధన ఫలితాలతో అమెరికా సంస్థ(American Company)ను, ప్రఖ్యాత జర్నల్‌ని తప్పుదోవ పట్టించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అమెరికా ప్రభుత్వానికి చెందిన కీలక విభాగం ఆర్థిక సాయంతో జన్యు సంబంధిత అంశాలపై చేపట్టిన ఈ పరిశోధనలో ఆ దేశంలోని ఇద్దరు తెలుగు శాస్త్రవేత్తలతో పాటు ఓయూ(OU)లోని ఓ ఆచార్యురాలు భాగస్వామిగా ఉన్నారు.
ప్రఖ్యాత నేచర్ జర్నల్(Journal of Nature)లోని సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో 2014లో వీరి పరిశోధన పత్రం ప్రచురితమైంది. ఫలితాలపై అనుమానం వచ్చిన అమెరికా ఆఫీస్ ఆఫ్ రీసెర్చ్ ఇంటిగ్రిటీ (ఓఆర్‌ఐ) విచారణ చేపట్టగా అది నకిలీ పరిశోధనగా తేలింది. దీంతో ప్రధాన శాస్త్రవేత్త(Telugu Scientist)ను అమెరికా ప్రభుత్వ నిధులతో చేపట్టే ప్రాజెక్టుల్లో పాల్గొనకుండా అయిదేళ్లపాటు డిబార్(Debar) చేశారు.
ఈ వ్యవహారంలో ఓయూ ఆచార్యురాలు సహ భాగస్వామిగా ఉన్నట్లు అమెరికా ఫెడరల్ రిజిస్టర్, సైంటిఫిక్ రిపోర్ట్స్ నుంచి భారత సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి(డీఎస్‌టీ) నివేదిక అందింది. దీంతో విచారణ జరిపించాలని ఇటీవల ఓయూ(Osmania University)కు కేంద్రం లేఖ రాసింది. ప్రస్తుతం సదరు ఆచార్యురాలు ఓయూలో కీలక స్థానంలో ఉండటం విశేషం. ఈ విషయంపై ఆమెను వివరణ కోరగా.. పరిశోధన పత్రంలో సహరచయితగా ఉన్నట్లు చెప్పారు. తదుపరి ఎలాంటి వివరాలు కావాల్సినా ప్రధాన రచయితతో మాట్లాడాలని తెలిపారు. కేంద్రం నుంచి లేఖ వచ్చిందని, త్వరలోనే విచారణ చేపడతామని ఓయూ ఉపకులపతి డి.రవీందర్ చెప్పారు. సదరు పరిశోధన పత్రాన్ని వెబ్‌సైట్ నుంచి తొలగించినట్లు నేచర్ జనరల్ ప్రకటించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి