UK Relaxations: లండన్ వెళ్లాలనుకునేవారికి శుభవార్త. భారత ప్రయాణీకులపై ఉన్న ప్రయాణ ఆంక్షల్ని యూకే తొలగించింది. ఇండియాను రెడ్ జాబితా నుంచి అంబర్ జాబితాలోకి మార్చింది. ఇక యూకే వెళ్లాలంటే నిబంధనలు ఇలా ఉండనున్నాయి.
నిన్నటి వరకూ భారత ప్రయాణీకులు యూకే (Uk Travel Restrictions)వెళ్లాలంటే చాలా కఠినంగా ఉండేది. దీనికి కారణం ఇండియాను రెడ్ లిస్ట్‌లో ఉంచడమే. ఇప్పుడా అవసరం లేదు. భారత ప్రయాణీకులపై ఉన్న ప్రయాణ ఆంక్షల్ని యూకే సడలించింది. ఇండియాను రెడ్ జాబితా నుంచి అంబర్ జాబితాలోకి మార్చింది. దీని ప్రకారం వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న భారత ప్రయాణీకులు బ్రిటన్ హోటల్స్‌లో 10 రోజుల క్వారంటైన్ చేయాల్సిన అవసరం లేదు. పదిరోజులపాటు హోం క్వారంటైన్(Home Quarantine)ఉంటే సరిపోతుంది. ఇప్పటి వరకూ బ్రిటన్ వెళితే..అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్లలో 1.80 లక్షలు ఖర్చు చేసి ఉండాల్సిన పరిస్థితి. ఇప్పుడా అవసరం లేదు.
కరోనా వైరస్ తీవ్రత ఆధారంగా యూకే ప్రభుత్వం(Uk government) సిగ్నల్ లైట్స్‌లో ఉండే రంగులతో రెడ్, అంబర్, గ్రీన్ జాబితాల్లో దేశాల్ని విభజించింది. ఎప్పటికప్పుడు వివిధ దేశాల్ని కరోనా తీవ్రతను గమనిస్తూ ప్రతి 3 వారాలకోసారి జాబితా మార్చుతూ వస్తోంది. అంబర్ జాబితాలో(Amber List) ఉండే దేశాల్నించి వచ్చే ప్రయాణీకులు మూడు సార్లు కరోనా పరీక్షలు చేయించుకోవల్సి ఉంటుంది. బ్రిటన్ వెళ్లడానికి మూడు రోజుల ముందు, అక్కడికి చేరిన రోజు లేదా రెండ్రోజుల్లో రెండవసారి, తరువాత 8 రోజులకు చివరిసారి పరీక్షలు (Covid19 Tests)చేయించుకోవాలి. భారత్‌లో ఉన్న బ్రిటన్ పౌరులైతే వ్యాక్సినేట్ అయుంటే క్వారంటైన్ అవాల్సిన అవసరం లేదు. ఇండియాలో నిన్నటి వరకూ కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నందున రెడ్ లిస్ట్(Red list)లో ఉంది. ఇప్పుడు కేసులు తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ జరుగుతుండటంతో అంబర్ లిస్టులోకి మారింది.
Also read: డెల్టా కంటే ప్రమాదకరమైన వేరియంట్‌కు అవకాశం, ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook