Donald Trump: డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ

US Presidential Election 2024: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ రాజకీయాల్లోకి వస్తారా లేదా అనే విషయంపై చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి. త్వ‌ర‌లోనే భారీ ప్ర‌క‌ట‌న చేస్తాన‌ని గ‌త వారం చెప్పిన ట్రంప్.. మంగళవారం అర్ధరాత్రి కీలక ప్రకటన చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 16, 2022, 12:42 PM IST
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ

Donald Trump will Fight again for President Post: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీర్ఘకాల ఊహాగానాలకు మంగళవారం ముగింపు పలికారు. 2024లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్నట్లు ప్రకటించారు. ట్రంప్ మళ్లీ రాజకీయాల్లోకి వస్తారని చాలా కాలంగా చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే భారీ ప్రకటన ఉంటుందని ఆయన ఇటీవల చెప్పారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం అర్ధరాత్రి ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చారు. 

2024 అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన పత్రాలను డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఫ్లోరిడాలోని ఓ రిసార్ట్‌లో తన మద్దతుదారులతో సమావేశం నిర్వహించారు. ట్రంప్ ప్రకటన అనంతరం అందరూ శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు అమెరికా పునరాగమనం ప్రారంభమవుతోందని ట్రంప్ అన్నారు. అమెరికాను మళ్లీ గొప్పగా.. కీర్తిగా మార్చడానికి ఈ రోజు తాను 2024 ఎన్నికల్లో అమెరికా అధ్యక్ష పదవికి తన అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తున్నానని తెలిపారు. 

అయితే డొనాల్డ్ ట్రంప్ ముందు ఈసారి అనేక సవాళ్లు ఎదురుకాబోతున్నాయి. ముఖ్యంగా సొంత పార్టీలోని ఇతర నేతల నుంచే గట్టి పోటీ ఎదురుకానుంది. రిపబ్లికన్ పార్టీ నుంచి ఈసారి అధ్యక్ష అభ్యర్థులలో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్, మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ కూడా ఉన్నారు. ట్రంప్ ముందుగా వీరితో పోటీ పడి నెగ్గాల్సి ఉంటుంది. ఆ తర్వాత 435 సీట్లున్న ప్రతినిధుల సభలో ట్రంప్ మెజారిటీ సాధించాల్సి ఉంటుంది. చివరిసారిగా 2020లో ఎన్నికల ఫలితాల తర్వాత ట్రంప్ ఓడిపోయినప్పుడు హై వోల్టేజ్ డ్రామా క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.  

ఇటీవల జరిగిన అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ విధేయులే పార్టీ ఓటమికి కారణమని విమర్శలు వస్తున్నాయి. పార్టీని నడిపేందుకు ట్రంప్ సరైన వ్యక్తి కాదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ తరుణంలోనే తాను మరోసారి అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. మధ్యంతర ఎన్నికల ప్రచారంలో హుషారుగా పాల్గొన్న ట్రంప్.. 2024 అధ్యక్ష ఎన్నికలకు మరింత ఉత్సాహంగా రెడీ అవుతున్నారు. 

Also Read: Rarest Blood Group: ప్రపంచంలో 45 మందిలో మాత్రమే ఈ బ్లడ్ గ్రూప్.. బంగారం కంటే ధర ఎక్కువే..  

Also Read: Super Star Krishna: అపురూపమైన జ్ఞాపకం.. సెలవిక సూపర్ స్టార్ కృష్ణ.. విజయశాంతి ఎమోషనల్   

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News