ప్రపంచంలో ఇప్పుడందరి దృష్టి హైపర్ లూప్ ట్రాన్స్పోర్ట్ ( Hyperloop Transport ) మోడ్‌పై పడింది. ప్రఖ్యాత కంపెనీలు నిరంతరం హైపర్ లూప్ ప్రయాణం అభివృద్ధిలో పడ్డాయి. వర్జిన్ గ్రూప్ ( Virgin Group ) నిర్మించిన హైపర్ లూప్ రైలు తొలిసారి ప్రయాణీకులతో విజయవంతంగా ప్రయాణించింది.
హైపర్ లూప్ రైల్ ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు ఓ ప్రత్యేక ఆకర్షణ. ఇంకా ప్రయోగదశలోనే ఉంది. కమర్షియల్‌గా ఇంకా ప్రారంభం కాలేదు. ఈ నేపధ్యంలో వర్జిన్ గ్రూప్ రికార్డు సృష్టించింది. రిచర్డ్ బ్రాన్స్కు చెందిన ఈ సంస్థ నిర్మించిన హైపర్ లూప్ రైలు విజయవంతమైంది. లాస్ వెగాస్ ( Las vegas valley ) నగరంలో తొలిసారి ప్రయాణీకులతో కూడిన హైపర్ లూప్ ట్రైన్ నడిపి ఖ్యాతి గాంచింది వర్జిన్ గ్రూప్ సంస్థ.
వర్జిన్ గ్రూప్ సంస్థ ఇప్పటికే ఏకంగా 4 వందల సార్లు హైపర్ లూప్ రైలు ట్రయల్స్ నిర్వహించింది. అయితే ప్రయాణీకులతో మాత్రం ఇప్పటి వరకూ జరగలేదు. ఇప్పుడు తొలిసారి ప్రయాణీకులతో హైపర్ లూప్ రైలును వర్జిన్ గ్రూప్ సంస్థ సక్సెస్‌ఫుల్‌గా నడిపింది. హైపర్ లూప్ ఛీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జోష్ జోజెల్, డైరెక్టర్ ఆఫ్ పాసెంజర్ ఎక్స్పీరియన్స్ సారా లుచియాన్ ఈ హైపర్ లూప్ రైలులో తొలి ప్రయణీకులుగా ఉన్నారు.
గంటకు 6 వందల మైళ్ల వేగంతో దూసుకెళ్లే సామర్ధ్యం కలిగినప్పటికీ..ప్రయాణీకులతో ఇదే తొలిసారి కాబట్టి గంటకు వంద మైళ్ల వేగానికి పరిమితం చేసి ట్రైన్ నడిపారు. ఈ రైలు 15 సెకన్ల వ్యవధిలో 5 వందల మీటర్లు దూసుకెళ్లింది. అత్యద్భుతమైన హైపర్ లూప్ టెక్నాలజీని రియాల్టీగా ..వాస్తవంగా మార్చేందుకు వర్జిన్ గ్రూప్ చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. నెవడా ఎడారిలో తన హైపర్ లూప్ మార్గాన్ని నిర్మించి..కొన్నేళ్లుగా ప్రయోగాలు చేస్తూ వస్తోంది.
హైపర్ లూప్ ( Hyperloop ) అనేది ఓ ప్రత్యేక నిర్మాణం. బాహ్యంగా అంటే రైలు మార్గంపై గానీ..రైలుకు వెలుపల గానీ ఎటువంటి గాలి అసలుండదు. అంటే ఏ విధమైన బాహ్యపరమైన ఒత్తిడి రైలుపై గానీ..దాని వేగంపై గానీ ప్రభావం చూపే అవకాశం లేదు. ఈ కారణంగానే హైపర్ లూప్ టెక్నాలజీలో రైలు అత్యంత వేగంగా ప్రయాణిస్తుందనేది ఓ సిద్ధాంతం. ఇదే టెక్నాలజీ ఆధారంగా ప్రస్తుతానికి గంటకు 6 వందల మైళ్ల వేగంతో ప్రయాణించడం కంపెనీ లక్ష్యం. భవిష్యత్ లో వేగాన్ని మరింతగా పెంచాలనేది కంపెనీ ఆలోచనగా ఉంది.
ఈ హైపర్ లూప్ రైలును ఇండియాలో ముంబై నుంచి పూణే మధ్య నడపడానికి ప్రతిపాదన సిద్ధమైంది. ఇదే విర్జిన్ గ్రూపుతో చర్చలు సాగాయి. ఇప్పుడీ తొలి పాసెంజర్ ప్రయోగం సక్సెస్ కావడంతో ముంబై-పూణే ( Mumbai-Pune Hyperloop train ) మార్గం సుగమమైనట్టే. ముంబై-పూణే మధ్య హైపర్ లూప్ రైలు నిర్మాణం పూర్తయితే ...కేవలం 25 నిమిషాల్లో ముంబై నుంచి పూణేకు చేరుకోవచ్చు. Also read: Corona vaccine: ఫైజర్ వ్యాక్సిన్ 90 శాతం సక్సెస్..ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభం