Omicron: కరోనా కొత్త వేరియంట్‌కు 'ఒమిక్రాన్'గా పేరు-బోత్సువానాలో మొదలై బెల్జియం వరకు

Covid 19 new variant Omicron: కోవిడ్ 19 కొత్త వేరియంట్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ 'ఒమిక్రాన్‌'గా నామకరణం చేసింది. ఆందోళనకర వేరియంట్‌గా దీన్ని గుర్తించిన డబ్ల్యూహెచ్ఓ... దీనిపై మరింత విస్తృత పరిశోధనలు అవసరమని పేర్కొంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 28, 2021, 09:31 AM IST
  • కోవిడ్ కొత్త వేరియంట్‌కు ఒమిక్రాన్‌గా నామకరణం
    వ్యాక్సిన్లకు కొత్త వేరియంట్ లొంగకపోవచ్చుననే అనుమానాలు
    మరింత విస్తృత పరిశోధనలు అవసరమన్న డబ్ల్యూహెచ్ఓ
 Omicron: కరోనా కొత్త వేరియంట్‌కు 'ఒమిక్రాన్'గా పేరు-బోత్సువానాలో మొదలై బెల్జియం వరకు

Covid 19 new variant Omricon: కరోనా ఇక తగ్గుముఖం పట్టిందని ప్రపంచమంతా భావిస్తున్న తరుణంలో... కొత్త వేరియంట్ B.1.1.529 (Omicron) రూపంలో అది విరుచుకుపడటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. మొదటిసారిగా బోత్సువానాలో (Botswana) గుర్తించిన ఈ కొత్త వేరియంట్‌‌కు డబ్ల్యూహెచ్ఓ 'ఒమిక్రాన్'గా నామకరణం చేసింది. అంతేకాదు, ఈ వేరియంట్‌ అత్యంత ఆందోళనకరమైనదిగా పేర్కొంది. అధిక సంఖ్యలో జెనెటిక్ మ్యుటేషన్ల కారణంగా దీని వ్యాప్తి తీవ్రంగా ఉండవచ్చునని... కరోనా వ్యాక్సిన్ (Coronavirus) తీసుకున్నవారికి కూడా దీని ముప్పు పొంచి ఉండే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం (నవంబర్ 26) డబ్ల్యూహెచ్ఓ నిర్వహించిన అత్యవసర సమావేశంలో కొత్త వేరియంట్ ఒమ్రికాన్‌పై విస్తృత స్థాయిలో చర్చించారు.

ఒమ్రికాన్‌పై (Omicron) అత్యవసరంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కొంతమంది ఇండిపెండెంట్ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో దీనిపై మరింత విస్తృతమైన పరిశోధన జరగాల్సి ఉందని.. అప్పుడే ఒమ్రికాన్ తీవ్రతపై ఒక అంచనాకు రావొచ్చునని చెప్తున్నారు. మిగతా వేరియంట్లతో పోలిస్తే ఒమ్రికాన్‌తో రీఇన్ఫెక్షన్ ముప్పు ఎక్కువగా ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ప్రస్తుత కరోనా వ్యాక్సిన్లు ఒమ్రికాన్ వేరియంట్ (Covid 19 Variant) నుంచి రక్షణ కల్పిస్తాయని పరిశోధకులు చెబుతున్నప్పటికీ... కొత్త వేరియంట్‌పై వాటి ప్రభావం ఎంత మేర ఉంటుందనేది పరిశోధనల ద్వారానే వెల్లడవుతుందని అంటున్నారు.

ఒమిక్రాన్ వ్యాప్తి-బోత్సువానా టు బెల్జియం :

ఈ ఏడాది నవంబర్ 11న మొదటిసారిగా బోత్సువానాలో (Botswana) ఒమిక్రాన్ వేరియంట్‌ B.1.1.529ను గుర్తించారు. దీనికి సంబంధించి అక్కడ మొదట 3 కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత బోత్సువానాకు సమీపంలో ఉండే దక్షిణాఫ్రికాలోనూ ఈ వేరియంట్ బయటపడింది. అక్కడి గౌతెంగ్ ప్రావిన్స్‌లో దాదాపు 90శాతం కేసులకు ఈ వేరియంటే కారణమని అంచనా వేశారు. గౌతెంగ్‌తో పాటు సౌతాఫ్రికాలో (Southafrica) మరో 8 ప్రావిన్సులకు ఈ వేరియంట్ వ్యాప్తి చెందినట్లు గుర్తించారు.

Also Read: Team India : దక్షిణాఫ్రికాలో కరోనా విజృంభణతో టీమ్‌ ఇండియా పర్యటనపై అనుమానాలు

సౌతాఫ్రికాలో కొత్త వేరియంట్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిన మరుసటిరోజే... ఇజ్రాయెల్‌లోనూ ఆ వేరియంట్ బయటపడింది. ఇటీవలే ఆఫ్రికా దేశం మలావి నుంచి తిరిగొచ్చిన వ్యక్తిలో ఈ వేరియంట్‌ను గుర్తించినట్లు ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత హాంకాంగ్‌లో ఇదే వేరియంట్‌కు సంబంధించి ఒక కేసు, బెల్జియంలో ఒక కేసు నమోదయ్యాయి. బెల్జియంలో కరోనా వ్యాక్సిన్ తీసుకోని వ్యక్తి ఈ వేరియంట్ (Covid 19) బారినపడినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ఫ్రాంక్ వాండెన్ వెల్లడించారు. దీని తీవ్రత గురించి ఇప్పుడే తామేమీ చెప్పలేమన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  Twitter , Facebook

Trending News