Pfizer-BioNTech వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి WHO అనుమతి

Covid-19 Vaccine: కోవిడ్-19 వల్ల ఇబ్బంది పడుతున్న కోట్లాది మంది ప్రజలకు శుభవార్త. ఫైజర్- బయోన్‌టెక్ సంస్థలు తయారు చేసిన వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇచ్చింది. 

Last Updated : Jan 1, 2021, 08:39 AM IST
    1. కోవిడ్-19 వల్ల ఇబ్బంది పడుతున్న కోట్లాది మంది ప్రజలకు శుభవార్త.
    2. ఫైజర్- బయోన్‌టెక్ సంస్థలు తయారు చేసిన వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇచ్చింది.
    3. దీంతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలు వ్యాక్సిన్ వినియోగం విషయంలో సొంత నియంత్రణా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు అని తెలిపింది.
Pfizer-BioNTech వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి WHO అనుమతి

Covid-19 Vaccine: కోవిడ్-19 వల్ల ఇబ్బంది పడుతున్న కోట్లాది మంది ప్రజలకు శుభవార్త. ఫైజర్- బయోన్‌టెక్ సంస్థలు తయారు చేసిన వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇచ్చింది. దీంతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలు వ్యాక్సిన్ వినియోగం విషయంలో సొంత నియంత్రణా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు అని తెలిపింది.

Also Read | 2021 జనవరి నుంచి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు రూల్స్‌లో మార్పు, పూర్తి వివరాలు చదవండి!
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్ణయంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోవిడ్-19 వైరస్ సంక్రమించిన వారిలో అత్యవసరం అయిన వారికి టీకీ అందించే అవకాశం లభించింది. ఇటీవలే అమెరికా, యూరోప్‌కు చెందిన Pfizer-BioNTech కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేసి ప్రపంచానికి శుభవార్త తెలిపాయి. అయితే ఈ టీకాలు వాణిజ్చ విపణిలోకి వచ్చేలోపు ఇలా అత్యవసర సేవలకోసం వివిధ దేశాల్లో అనుమతి కోరాయి.

 

Also Read | EPFO ఖాతా ఉందా? అయితే ఈ 5 ప్రయోజనాల గురించి తెలుసుకోండి!

భారతదేశ (India) ప్రభుత్వం నుంచి కూడా అనుమతి కోరగా.. సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ నిరాకరించింది.  ఫైజర్ టీకాతో పాటు భారత్ బయోటెక్ టీకాను కూడా అత్యవసర వినియోగం కోసం ప్రస్తుతానికి అయితే అనుమతి ఇవ్వలేదు. దీనిపై ఇవాళ కీలక సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

  •  

  •  

Trending News