WW II Bomb: ప్రమాదవశాత్తు పేలిన రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు

పోలాండ్ దేశంలో రెండవ ప్రపంచ యుద్ధం ( World War II ) సమయం నాటి బాంబు పేలింది. బాల్టిక్ సముద్రంలో ఐదుటన్నుల బాంబును నిర్వీర్యం చేయడానికి చిన్నపాటి ఆపరేషన్ నిర్వహించారు.ఇందులో భాగంగా బాంబు పేలి విస్పోటనం చెందింది. ఈ పేలుడులో ఎవరూ గాయపడలేదు అని అధికారులు తెలిపారు.

Last Updated : Oct 14, 2020, 07:36 PM IST
    • పోలాండ్ దేశంలో రెండవ ప్రపంచ యుద్ధం ( World War II) సమయం నాటి బాంబు పేలింది.
    • బాల్టిక్ సముద్రంలో ఐదుటన్నుల బాంబును నిర్వీర్యం చేయడానికి చిన్నపాటి ఆపరేషన్ నిర్వహించారు.
    • ఇందులో భాగంగా బాంబు పేలి విస్పోటనం చెందింది. ఈ పేలుడులో ఎవరూ గాయపడలేదు అని అధికారులు తెలిపారు.
WW II Bomb: ప్రమాదవశాత్తు పేలిన రెండో  ప్రపంచ యుద్ధం నాటి బాంబు

పోలాండ్ దేశంలో రెండవ ప్రపంచ యుద్ధం ( World War II ) సమయం నాటి బాంబు పేలింది. బాల్టిక్ సముద్రంలో ఐదుటన్నుల బాంబును నిర్వీర్యం చేయడానికి చిన్నపాటి ఆపరేషన్ నిర్వహించారు.ఇందులో భాగంగా బాంబు పేలి విస్పోటనం చెందింది. ఈ పేలుడులో ఎవరూ గాయపడలేదు అని అధికారులు తెలిపారు.

ALSO READ| What Is Sonic Boom: ప్యారిస్ ను వణికించిన సోనిక్ బూమ్ అంటే ఏంటి ? ఎందుకలా జరిగింది ?

ఈ బాంబును టాల్ బాయ్ పిలుస్తారు అని..కొంత మంది దీన్ని ఎర్త్ క్వేక్ ( Earth Quake )  బాంబు అని కూడా పిలుస్తారు అని అధికారులు తెలిపారు. 1945 సమయంలో రాయల్ ఎయిర్ ఫోర్స్ సభ్యులు నాజీ యుద్ధ నావలపై దీన్ని వదిలేశారట. గత ఏడాది దీన్ని సముద్రంలో సుమారు 39 అడుగుల లోతులో కనుక్కున్నారు. పోలాండ్ దేశంలోని పశ్చిమ భాగంలో ఉన్న స్వినౌజీ పోర్టుకు సమీపంలో దీన్ని అధికారులు కనుక్కున్నారు. 

స్వినౌజీ సిటీ హాల్ అధికార ప్రతినిధి ఒక మీడియా సంసతో మాట్లాడుతూ ఈ బాంబు నిర్వీర్యం చేసే సమయంలో జరిగిన పేలుడులో ఎవరూ గాయపడలేదు అని తెలిపారు.  మిలిటరీ నిపుణుల సారధ్యంలో బాంబు నిర్వీర్యం చేశారట. నగరంలోని నిర్మాణాలకు నష్టం కలగకుండా ఈ ఆపరేషన్ పూర్తి చేసినట్టు తెలిపారు. ఈ వారం ఆరంభంలో ప్రారంభం అయిన ఈ ఆపరేషన్ చాలా సున్నితమైంది అని.. చిన్న అలజడి కూడా బాంబు విస్పోటనం చెందేంత ప్రభావితం చేయగలదని తెలిపారు.

ALSO READ | Doppelgänger: మనుషులను పోలిన మనుషులు అంటాం కదా.. వీళ్లే వాళ్లు.. 

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News