Flash: ఏపీలో కొత్తగా మరో 19 కరోనావైరస్ పాజిటివ్ కేసులు గుర్తింపు

ఏపీలో తాజాగా మరో 19 కరోనావైరస్ పాజిటివ్ కేసులను (Coronavirus positive cases in AP) గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఏపీ సర్కార్ ఓ హెల్త్ బులెటెన్ విడుదల చేసింది. ఉదయం 9 గంటల వరకు కొత్తగా 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు ఏపీ సర్కార్ ఈ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

Last Updated : Apr 3, 2020, 12:10 PM IST
Flash: ఏపీలో కొత్తగా మరో 19 కరోనావైరస్ పాజిటివ్ కేసులు గుర్తింపు

అమరావతి: ఏపీలో తాజాగా మరో 19 కరోనావైరస్ పాజిటివ్ కేసులను (Coronavirus positive cases in AP) గుర్తించినట్టు అధికారులు తెలిపారు. దీంతో ఏపీలో ఇప్పటివరకు కరోనావైరస్ పాజిటివ్ సోకిన వారి సంఖ్య మొత్తం 161కి చేరుకుంది. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఏపీ సర్కార్ ఓ హెల్త్ బులెటెన్ విడుదల చేసింది. ఉదయం 9 గంటల వరకు కొత్తగా 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు ఏపీ సర్కార్ ఈ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. హెల్త్ బులెటిన్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటివరకు అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 32 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదృష్టవశాత్తుగా శ్రీకాకుళం, విజయనగరం జిలాల్లో కరోనావైరస్ ఉనికి కనిపించలేదు. కర్నూలు జిల్లాలో ఒకటి, అనంతపురం జిల్లాలో 2 కేసులు వెలుగుచూశాయి.

Read also : పోలీసు స్టేషన్‌ ఆవరణలోనే బర్త్ డే పార్టీ.. పోలీసుల నిర్వాకంపై పబ్లిక్ సీరియస్.. వీడియో వైరల్

జిల్లాల వారిగా పాజిటివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది.

1) శ్రీకాకుళం..0

2) విజయనగరం.0

3) కర్నూల్-1

4) అనంతపురం-2

5) చిత్తూరు-9

6) ఈస్ట్ గోదావరి-9

7) విశాఖ..14

8.వెస్ట్ గోదావరి..15

9) ప్రకాశం..17

10) కడప-19

11) గుంటూరు-20

12) కృష్ణా-23

13) నెల్లూరు-32

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News