Flash: ఏపీలో పెరుగుతున్న కరోనావైరస్ కేసులు.. జిల్లాల వారీగా వివరాలు

ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం తరహాలోనే బుధవారం ఏప్రిల్ 1 నాడు కూడా రాష్ట్రంలో మరో 24 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో గుర్తించిన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 111కు చేరింది.

Last Updated : Apr 2, 2020, 01:22 AM IST
Flash: ఏపీలో పెరుగుతున్న కరోనావైరస్ కేసులు.. జిల్లాల వారీగా వివరాలు

అమరావతి: ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం తరహాలోనే బుధవారం ఏప్రిల్ 1 నాడు కూడా రాష్ట్రంలో మరో 24 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో గుర్తించిన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 111కు చేరింది. ఈ మేరకు ఏపీ సర్కార్ తరపున రాష్ట్ర నోడల్ అధికారి డా అర్జ శ్రీకాంత్ బుధవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. రాత్రి 7 గంటల తర్వాత విడుదలైన కోవిడ్ పరీక్షల ఫలితాలను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదికను రూపొందించినట్టు నోడల్ అధికారి డా అర్జ శ్రీకాంత్ తెలిపారు. Gandhi hospital: డాక్టర్లపై దాడి ఘటన.. స్పందించిన ఆరోగ్య శాఖ మంత్రి

ఏపీ సర్కార్ వెల్లడించిన వివరాల ప్రకారం జిల్లాల వారీగా వివరాలిలా ఉన్నాయి.

క్ర. సంఖ్య జిల్లా పేరు మొత్తం కేసుల సంఖ్య  కోలుకున్న వారి సంఖ్య 
1 అనంతపూర్                2  
2 చిత్తూరు                6  
3 తూర్పు గోదావరి                9  
4 గుంటూరు               20  
5 కడప               15  
6 కృష్ణా               15  
7 కర్నూలు                 1  
8 నెల్లూరు                 3                     1
9 ప్రకాశం               15  
10 విశాఖపట్నం               11                      1
11 పశ్చిమ గోదావరి                        14  
    111                     2

కరోనావైరస్ లైవ్ అప్‌డేట్స్ కోసం జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

 

 

Trending News