AP Assembly Session | కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా పలు రంగాలలో పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. చట్ట, శాసనసభ పనులకు సైతం లాక్‌డౌన్ (LockDown 5.0) నిబంధనలతో కాలాయాపన జరుగుతుంది. మరోవైపు లాక్‌డౌన్ 5.0తో మరిన్నింటికి కేంద్ర ప్రభుత్వం సడలింపులు ప్రకటించింది. ఆలయాలు, మత సంబంధమైన స్థలాలకు జూన్ 8 నుంచి అనుమతినిచ్చారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session 2020) నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇండస్ట్రీ కోసం కాదు, వారి స్వార్థం కోసం: బాలకృష్ణ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 16 (జూన్ 16) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది మార్చి నెలలో ఓటాన్ అకౌంట్‌ను ప్రవేశపెట్టిన వైఎస్సార్ సీపీ సర్కార్.. ఈ అసెంబ్లీ సమావేశాలలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను (AP Assembly Budget Session 2020) ప్రవేశపెట్టనుంది. జూన్ 16న ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటిరోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించనున్నారు. Actors Commit Suicide: షూటింగ్స్ లేక ఆర్థిక సమస్యలతో అన్నాచెల్లెళ్ల ఆత్మహత్య
తొలి రోజు గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం కానుంది. బీఏసీలో సమావేశాల నిర్వహణతో పాటు చర్చించే అంశాలపై స్పష్టత రానుంది. జూన్ 18న శాసనసభలో ఏపీ ఆర్థికశాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ (AP Assembly Budget Session) ను ప్రవేశపెట్టనున్నారు. ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలను సైతం ఈ సమావేశాలో నిర్వహించనున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
గ్లామర్ డాల్ సెక్సీ ఫొటోలు వైరల్