Janasena Pawan Kalyan: సొంత అన్ననే పక్కన పెట్టా.. రచ్చగా మారిన జనసేన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు..

Andhra Pradesh Politics: తోడ బుట్టిన అన్నను వద్దను కొని జనసేన పార్టీ పెట్టానని, తనకు ప్రజలకు మేలు చేయాలనే ఆశయం మాత్రమే ఉందన్నారు. ఒకసారి ఏదైన అనుకుంటే , ముందు వెనుక ఏది ఆలోచించనంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు.

Written by - Inamdar Paresh | Last Updated : Mar 12, 2024, 07:21 PM IST
  • అన్నను కాదని పార్టీ పెట్టానన్న పవన్ కళ్యాణ్..
  • ప్రజలకు మేలు చేయడమే సంకల్పమని క్లారిటీ..
Janasena Pawan Kalyan: సొంత అన్ననే పక్కన పెట్టా.. రచ్చగా మారిన జనసేన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు..

Pawan Kalyan Comments On Chiranjeevi: ఆంధ్ర ప్రదేశ్ లో జనసేన పార్టీకి పొత్తులో భాగంగా తక్కువ సీట్లు వచ్చాయని అనేక మంది కామెంట్లు చేస్తున్నారని దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. తనకు ప్రజలకు మంచి చేయాలని తపన ఉందన్నారు. ఏదైన అనుకుంటే.. ఎవర్నికూడా లెక్కచేయనని అన్నారు. తన సొంత అన్నను కాదని జనసేన పార్టీపెట్టానని, నిర్ణయం తీసుకునే ముందు ఆలోచిస్తానని, నిర్ణయం తీసుకున్నాక ముందు వెనుక ఆలోచించేది లేదని పవన్ అన్నారు.

Read More: Haryana New CM Nayab Singh Saini: హర్యానా కొత్త సీఎం గా నయబ్ సింగ్ సైనీ.. ఆయన రాజకీయ ప్రస్థానమిదే..

ఇటీవల బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుపెట్టుకుని ఏపీ ఎన్నికల బరిలో నిలుస్తున్నాయి. మూడు పార్టీలు కలిసి, 175 చోట్ల పోటీచేస్తే ఈసారి వైఎస్సార్సీపీ ఓడిపోవడం ఖాయమన్నారు. ఈ సారి ప్రజలు ఆలోచించి తమకుమంచి చేసే వారిని ఓటేసి గెలిపించాలన్నారు. ఏమాత్రం అప్రమత్తంగా లేకున్న కూడా ప్రజలను ఈసారి ఎవరు కాపాడలేరంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. భీమవరంలో మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జనసేన కండువ కప్పుకున్నారు.

Read More: White Hair: టీనేజ్ లోనే వెంట్రుకలు తెల్లబడ్డాయా..?.. ఈ తప్పులు అస్సలు చేయోద్దు..

ఈక్రమంలో భీమవరంలో రౌడీయిజం పోవాలన్నారు. ఇక్కడ నేను బాధితుడినే.. నాకు స్థలం ఇవ్వడానికి కూడా కొందరు భయపడుతున్నారు. వీరిని వెనుక నుంచి కొందరు బెదిరిస్తున్నారన్నారు. గతంలో తాను.. భీమవరంనుంచి పోటీచేసుకుంటే ఇప్పులు లెక్కమరోవిధంగా ఉండేదనవ్నారు. రాజకీయాల్లో యుద్ధం మాత్రమే ఉంటుంది.. బంధుత్వం మాత్రం ఉండదని, తప్పులు చేస్తే ఎవరినైన ఊరుకునేది లేదని పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News