Andhra pradesh home minister Vangalapudi anitha: ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు కూటమికి బ్రహ్మరథం పట్టారు. ఈ క్రమంలో చంద్రబాబు ఇటీవల చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా కేసరపల్లిలో ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబుతో పాటు, మరో 24 మంది కూటమి నుంచి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారికి ఈరోజు(శుక్రవారం) వివిధ శాఖలను కూడా కేటాయించారు. ఈనేపథ్యంలో ఏపీ హోమ్ మంత్రిగా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు చంద్రబాబు అవకాశం ఇచ్చారు. ఇదిలా ఉండగా.. వంగలపూడి అనిత..గతంలో వైసీపీ నేతలు చేసిన అరాచకాలను ఎప్పటికప్పుడు ఏకీపారేసింది.
Read more: Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..
వైసీపీ పాలనలో.. మెయిన్ రోజాను టార్గెట్ గా చేసుకుని ఆమె చేసిన తప్పులను బహిరంగంగా విమర్శించింది. తెలుగుదేశం ఉనికి లేకుండా చేయాలని భావించిన జగన్ సర్కారుకు.. వంగలపూడీ అనిత కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో వంగలపూడి అనిత.. పాయక రావు పేట నుంచి భారీ మెజార్టీతో గెలిచింది. దీంతో ఆమెను చంద్రబాబు హోమ్ మినిస్టర్ పదవిని కట్టబెట్టారు.
ఇదిలా ఉండగా.. గతంలో వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు.. కూడా మహిళలకే హోం మంత్రి పదవిని కట్టబెట్టారు. ఇప్పుడు .. చంద్రబాబు కూడా అదే సంప్రదాయం కొనసాగించినట్లు తెలుస్తొంది. హోంమంత్రిగా వంగలపూడీ అనితకు అవకాశం కల్పించారు. పార్టీ పట్ల ఆమెకు ఉన్న విధేయత వల్ల.. ఎంత మంది సీనియర్లు ఉన్న కూడా కీలక పదవి ఆమెను వరించింది.
వంగలపూడీ అనిత ప్రస్థానం..
రాజకీయాల్లో కీలకంగా మారకన్న ముందు.. వంగలపూడీ అనిత గతంలో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. ఇదిలా ఉండగా.. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేస్తు వైసీపీ విధానాలను తీవ్రంగా విమర్శించారు. ఎప్పటికప్పుడు వైసీపీ చేసిన అరాచకాలను మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ ఎండగడుతు వచ్చారు. దీంతో అనితను అనేక పర్యాయాలు సోషల్ మీడియాలో ఘెరంగా ట్రోలింగ్ కూడా చేశారు. వీటన్నింటిని తట్టుకుని ఈరోజు అనిత ఒక శక్తివంతమైన మహిళగా, మంత్రిగా ఎదిగి అందరికి ఆదర్శంగా మారారు.
Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..
అయితే 2019 ఎన్నికల్లో ఓడిపోయినా కూడా .. టీడీపీ ఆమెకు తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా తగ్గకుండా.. వైసీపీని తప్పులను విమర్శిస్తు.. ఇటీవల జరిగిన ఎన్నికలలో.. కూటమి నేతలను కలుపుకుని వెళ్లి 2024 ఎన్నికల్లో పాయకరావుపేట అసెంబ్లీ స్థానం నుంచి 43,727 ఓట్ల తేడాతో గెలిచి హిస్టరీ క్రియేట్ చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మంత్రివర్గంలో చోటు దక్కించుకోవటమే కాకుండా.. ఏకంగా హోం మంత్రిగా నియమితులై జిల్లాతోపాటు, ఏపీకి గర్వకారణంగా మారారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter