Chandrababu Fire: వివేకా కేసులో సాక్షులను చంపేస్తున్నారు.. చంద్రబాబు సంచలన ఆరోపణలు

Chandrababu Fire: వైసీపీ దమనకాండ పేరుతో తయారు చేసిన పుస్తకాన్నిటీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  పుస్తకం విడుదల చేశారు. మొత్తం 17 అంశాలపై టీడీపీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. జగన్ పాలనపై నిప్పులు చెరిగారు

Written by - Srisailam | Last Updated : Jun 10, 2022, 02:09 PM IST
  • వైసీపీ దమనకాండపై టీడీపీ పుస్తకం
  • జగన్ పాలనలో ఏపీ వల్లకాడైంది- బాబు
  • నేరస్తులకు డీజీపీ వంత - చంద్రబాబు
Chandrababu Fire: వివేకా కేసులో సాక్షులను చంపేస్తున్నారు.. చంద్రబాబు సంచలన ఆరోపణలు

Chandrababu Fire: వైసీపీ దమనకాండ పేరుతో తయారు చేసిన పుస్తకాన్నిటీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  పుస్తకం విడుదల చేశారు. మొత్తం 17 అంశాలపై టీడీపీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. జగన్ పాలనపై నిప్పులు చెరిగారు. వైసీపీ మూడేళ్ల పాలనలో ఏపీ వల్లకాడులా మారిందన్నారు చంద్రబాబు. ఏపీలో శాంతి భద్రతలు లేవన్నారు. కొత్త డీజీపీ వచ్చిన మార్పు లేదన్నారు. నేరస్తులకు వంతపాడే స్థితిలో డీజీపీ ఉన్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. పోలీసుల తీరు మారకుంటే.. తామే మారుస్తామని హెచ్చరించారు. పోలీసులకు ఖాకీ బట్టలకు న్యాయం చేయాలన్నారు. సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితిలో ప్రజలు ఉన్నారన్నారు చంద్రబాబు.

పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన టీడీపీ నేతలను హింసించారని అన్నారు. గత మూడేళ్లలో  32 మంది టీడీపీ నేతలను హత్య చేశారని చంద్రబాబు ఆరోపించారు.4వేల మంది కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారన్నారు. దాడుల భయంతో కొన్ని కుటుంబాలు ఆత్మకూరు, మాచర్లను వదిలి వెళ్లాయని తెలిపారు. దళిత, గిరిజన, బీసీ నేతలపై దమనకాండ చేస్తున్నారని విమర్శించారు. వేధింపులు తట్టుకోలేక మైనార్టీలు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు జరిగాయన్నారు. గత మూడేళ్లలో 2552 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చంద్రబాబు చెప్పారు. 422 మంది నిరుద్యోగులు ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. నాటు సారా వల్ల 232 మంది చనిపోయారని చంద్రబాబు చెప్పారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 62 మంది చనిపోయినా పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. ఈ ముఖ్యమంత్రి దుర్మార్గానికి విద్యార్థులు బలయ్యారని అన్నారు.

60 మంది టీడీపీ నేతలపై కేసులు పెట్టారని, నలుగురు మాజీ మంత్రులను జైలుకు పంపారని చంద్రబాబు ధ్వజమెత్తారు. మీడియాను కూడా వదల్లేదన్నారు. ఇంత జరుగుతున్నా సీబీఐ పట్టించుకోదా అని చంద్రబాబు ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో సానుభూతి పొందాలని చూశారన్నారు. ఇప్పుడు వివేకా కేసులో సాక్షులను చంపేస్తున్నారని చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరిని చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. డ్రైవర్ ను ఎమ్మెల్సీనే కొట్టి చంపడం దారుణమన్నారు. హంతక ఎమ్మెల్సీ కేసును పక్కదారి పట్టించేందుకు కోనసీమలో కులాల మధ్య చిచ్చు పెట్టారని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ పాలనలో సామాజిక న్యాయం కాదు సామాజిక హత్యలు జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. అతికీలకమైన కేసులు వస్తే సీబీఐ విచారణ జరగాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి ఐరెన్ లెగ్ ముఖ్యమంత్రి అన్న టీడీపీ అధినేత..  ఆయన పాలన మొదలైనప్పటి నుంచి అంతా వినాశనమే జరుగుతుందన్నారు.

Read also:Bus Charges Hike: విద్యార్థులను వదలని ఆర్టీసీ.. బస్‌ పాస్‌ చార్జీలు 150 శాతం హైక్  

Read also: KCR MEETING: సాయంత్రం కేసీఆర్ కీలక సమావేశం.. సంచలనం జరగబోతోందా?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News