'కైలాస్ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులు క్షేమం'

కైలాస్ మానస సరోవర్‌ యాత్రకు వెళ్ళి నేపాల్‌ సరిహద్దుల్లో చిక్కుకున్న తెలుగు యాత్రికుల యోగాక్షేమాలపై సచివాలయంలోని ఆర్టీజి కార్యాలయం నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు.

Last Updated : Jul 3, 2018, 10:32 AM IST
'కైలాస్ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులు క్షేమం'

కైలాస్ మానస సరోవర్‌ యాత్రకు వెళ్ళి నేపాల్‌ సరిహద్దుల్లో చిక్కుకున్న తెలుగు యాత్రికుల యోగాక్షేమాలపై సచివాలయంలోని ఆర్టీజి కార్యాలయం నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. దాదాపు మూడువేల మంది భారతీయులు నేపాల్‌ సరిహద్దులోని హిల్సా బేస్ క్యాంపు వద్ద చిక్కుకున్నారని, వీరిలో వంద మంది తెలుగువారు ఉన్నట్లుగా ఏపీ భవన్‌ కమిషనర్‌ సీఎంకు తెలిపారు. రియల్ టైమ్ గవర్నమెంట్ సెంటర్ (ఆర్టీజి) అధికారులు కూడా చైనా సరిహద్దు సమీపంలో చిక్కుకుపోయిన కొందరు పర్యాటకులతో మాట్లాడారని సీఎం చెప్పారు. నేపాల్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధులతో మాట్లాడి తెలుగు యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సురక్షిత ప్రాంతానికి తరలించాలని ఆదేశించారు.

ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ అధికారులు నేపాల్ ప్రభుత్వ అధికారులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా భారత రాయబార కార్యాలయ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
యాత్రికులతో తాము టచ్ లోనే ఉన్నామని, వారికి అవసరమైన ఆహారం, నీరు, ఇతర వసతులు కల్పిస్తామంది. యాత్రికులను సురక్షితంగా తీసుకొచ్చే మార్గాలను అన్వేషిస్తున్నట్లు, వాతావరణం అనుకూలించాక విమానాలు నడుపుతామని ఆయా సంస్థలు  చెప్పాయని పేర్కొంది.

'తెలుగు యాత్రికులు క్షేమం'

కొద్దిసేపటి క్రితం అందించిన సమాచారం మేరకు.. కైలాస్ మానస సరోవర్‌ యాత్రకు వెళ్ళి నేపాల్‌ సరిహద్దుల్లో చిక్కుకున్న వంద మందికి పైగా తెలుగు యాత్రికులు క్షేమమని ఏపీ భవన్ అధికారులు వెల్లడించారు. ఈమేరకు వారికి భారత యాత్రికులంతా క్షేమమని నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయం నుంచి సమాచారం అందింది. తుఫాను వల్ల యాత్రికులు ఎక్కడికీ కదల్లేని పరిస్థితి నెలకొందని, వాతావరణం అనుకూలించిన వెంటనే యాత్రికులను తిరిగి పంపుతామని తెలిపింది. ఏపీ భవన్ విజ్ఞప్తి మేరకు యాత్రికులకు మందులు, ఆహారం సరఫరా చేస్తున్నట్లు నేపాల్ భారత ఎంబసీ కార్యాలయం పేర్కొంది.

అమ‌ర్‌నాథ్ యాత్రకు అంత‌రాయం

జ‌మ్మూకాశ్మీర్‌లో ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల‌తో అమ‌ర్‌నాథ్ యాత్రకు అంత‌రాయం ఏర్పడింది. గంట గంట‌కు జీలం న‌ది ఉధృతి పెర‌గ‌డంతో న‌దీతార ప్రాంత వాసుల‌ను అధికారులు సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. వ‌ర్షాలు త‌గ్గి.. వాతావ‌ర‌ణం అనుకూలించిన త‌రువాతే అమ‌ర్‌నాథ్ యాత్ర తిరిగి ప్రారంభం కానుంది. దీంతో భ‌క్తులెవ‌రూ శిబిరాల నుంచి బ‌య‌కు రావొద్దని అధికారులు హెచ్చరించారు.

 

Trending News