ఏపీ డీఎస్సీ షెడ్యుల్ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం త్వరలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనుంది.

Last Updated : Apr 28, 2018, 05:34 PM IST
ఏపీ డీఎస్సీ షెడ్యుల్ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం త్వరలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించిన ఏపీ టెట్‌, డీఎస్సీ షెడ్యూల్‌‌ను విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖపట్టణంలో విడుదల చేశారు. 10,351 పోస్టుల భర్తీకి జూలై 6న ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామన్నారు. మే 4న టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని, ఏపీపీఎస్సీ ద్వారా డీఎస్సీ నిర్వహిస్తామని, ఆరు కేటగిరీల్లో డీఎస్సీ పోస్టుల భర్తీ ఉంటుందన్నారు. దీనికి సిలబస్ వారంలో ప్రకటిస్తామని అన్నారు.

మే 5 నుంచి మే 22 వరకు టెట్‌ దరఖాస్తులను స్వీకరిస్తామని, జూన్‌ 3 నుంచి టెట్‌ హాల్‌టికెట్లు జారీ చేస్తామన్నారు. జూన్‌ 10 నుంచి 21 వరకు టెట్‌ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. జులై 7 నుంచి డీఎస్సీ అప్లికేషన్లు స్వీకరిస్తామన్నారు. ఆగస్టు 1 నుంచి ఆన్‌లైన్‌లో మాక్ టెస్టు అందుబాటులో ఉంటుదని మంత్రి తెలిపారు. రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్‌ హబ్‌గా తయారు చేస్తున్నామని,  లోటు బడ్జెట్‌ ఉన్నా విద్యకు అధిక నిధులు కేటాయిస్తున్నామని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.

డీఎస్సీ నోటిఫికేషన్‌ వివరాలు

  • నోటిఫికేషన్‌ : 6-7-2018
  • దరఖాస్తు గడువు : 7-7-2018 నుంచి 9-8-2018 వరకూ
  • హాల్‌ టికెట్స్‌ : 15-08-2018
  • పరీక్షలు : 23-08-2018 నుంచి 30-08-2018 ( రెండు సెషన్లలో 9.30 నుంచి 12, 2.30 నుంచి 5 గంటల వరకూ పరీక్షలు )
  • ప్రాథమిక కీ : 31-08-2018
  • అభ్యంతరాల గడువు : 31-08-2018 నుంచి 07-09-2018 వరకూ
  • ఫైనల్‌ కీ :10-09-2018
  • తుది ఫలితాలు : 15-09-2018

ఖాళీల వివరాలు
 

  • ఎస్‌జీటీ - 4,967
  • ఎస్‌ఏ - 2978
  • లాంగ్వేజ్‌ పండిట్స్‌ - 312
  • పీఈటీ - 1056
  • మ్యూజిక్‌, డాన్స్‌ - 109
  • మోడల్‌ స్కూల్స్‌ - 929

Trending News