Ys Jagan on liquor Policy: లంచాల కోసమే కొత్త మద్యం పాలసీ, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన జగన్

Ys Jagan on liquor Policy: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన మద్యం పాలసీపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మండిపడ్డారు. సీఎం చంద్రబాబు సహా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. లిక్కర్ మాఫియా, సిండికేట్లకు రాష్ట్రం అడ్డాగా మారిపోయిందని మండిపడ్డారు. ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 14, 2024, 07:11 PM IST
Ys Jagan on liquor Policy: లంచాల కోసమే కొత్త మద్యం పాలసీ, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన జగన్

Ys Jagan on liquor Policy: ఏపీలో మద్యం పాలసీ మారింది. లాటరీ విధానం ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు మద్యం షాపులు కట్టబెడుతున్నారు. గత ప్రభుత్వ హయంలో ప్రైవేట్ వ్యక్తులకు కాకుండా ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలు నిర్వహించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తిరిగి ప్రైవేట్ వ్యక్తులకే మద్యం దుకాణాలు కట్టబెట్టడంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. ప్రభుత్వ హయాంలోని దుకాణాలు తొలగించి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం అవినీతి కాదా అని ప్రశ్నించారు. రానున్న ఐదేళ్ల కాలంలో ఎమ్మార్పీ కంటే అధిక ధరకు అమ్మేందుకు అనుమతివ్వడం దేనికి సంకేతమని నిలదీశారు.

ఒకవేళ ప్రభుత్వ పాలసీనే మంచిదైతే మంత్రులు, ఎమ్మెల్యేలు, చంద్రబాబు కనుసన్నల్లో బెదిరింపులకు ఎందుకు దిగుతున్నారని, ఆరాచకాలకు పాల్పడాల్సిన అవసరం ఏమొచ్చిందని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఎవరికెంత అంటూ కమీషన్లు వాటా వేసుకున్న మాట వాస్తవం కాదా అన్నారు. అన్ని లెక్కలు బేరీజు వేసుకుని నిర్ణయించిన ధరకు మద్యం అమ్ముతారా, ఇది బోగస్ కాదా అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు చదువు కోసమో లేదా ఇతర ఖర్చులకో పెట్టుకున్న ఆదాయాన్ని మీ జేబుల్లో వేసుకోవడం అవినీతి కాదా అని అడిగారు. కొత్త పాలసీ ద్వారా ప్రభుత్వానికి రావల్సిన ఆదాయానికి గండి కొట్టారు. ప్రజల్ని మభ్యపెట్టేందుకు చీప్ లిక్కర్ రేట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించి..మద్యం నాణ్యత తగ్గించి డిస్టిలరీల నుంచి లంచాల ఆదాయం పెంచుకునే కార్యక్రమం చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 20 డిస్టిలరీల్లో 14 చంద్రబాబు హయాంలో వచ్చినవేనని గుర్తు చేశారు. లిక్కర్ మాఫియాకు మద్యం దుకాణాలు అప్పగించి ఎమ్మార్పీపై రేట్లు పెంచి అమ్ముకునేందుకు అనుమతివ్వడం ప్రజల నడ్డి విరగ్గొట్టడం కాదా అని నిలదీశారు. 

ప్రభుత్వ హయాంలోని మద్యం వ్యాపారాన్ని ప్రైవేటుకు అప్పగించడం ద్వారా చంద్రబాబు ముఖ్యమంత్రి స్థానంలో రాష్ట్రానికి తండ్రిలా వ్యవహరించకుండా లిక్కర్ వ్యాపారిలా ఆలోచించారన్నారు. గతంలో అంటే 2014-19లో కూడా రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారని ఇప్పుడు అదే పరిస్థితి తీసుకొస్తున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీ కారణంగా ప్రభుత్వ లిక్కర్ దుకాణాల్లో పనిచేసిన 15 వేలమంది నిరుద్యోగులై రోడ్డున పడ్డారని గుర్తు చేశారు. ఇప్పటికైనా ఇలాంటి చర్యల్ని వెనక్కు తీసుకోకపోతే ప్రజల తరపున ఉద్యమిస్తామని వైఎస్ జగన్ హెచ్చరించారు.

Also read: Cyclone Alert: తుపాను ప్రభావం, భారీ వర్షాలతో వణుకుతున్న నెల్లూరు, రెడ్ అలర్ట్ జారీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News