AP Govt: ప్రైవేట్ ల్యాబ్‌లల్లో కరోనా పరీక్షలకు అనుమతి

 ప్రైవేట్‌ ల్యాబ్‌లల్లో కరోనావైరస్ ( Coronavirus ) పరీక్షల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ( AP Govt ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కరోనా పరీక్షలకు ( Corona Tests ) ధరలను నిర్ణయిస్తూ సోమవారం వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది.

Last Updated : Jul 27, 2020, 04:57 PM IST
AP Govt: ప్రైవేట్ ల్యాబ్‌లల్లో కరోనా పరీక్షలకు అనుమతి

Corona Tests: అమరావతి:  ప్రైవేట్‌ ల్యాబ్‌లల్లో కరోనావైరస్ ( Coronavirus ) పరీక్షల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ( AP Govt ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కరోనా పరీక్షలకు ( Corona Tests ) ధరలను నిర్ణయిస్తూ సోమవారం వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. ర్యాపిడ్‌ ఆంటీజన్ టెస్టులకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని పేర్కొంటూ ఉత్తర్వులు ఇచ్చింది. ఐసీఎంఆర్‌ అనుమతించిన ల్యాబ్‌లలో కోవిడ్ టెస్టులు జరపాలని, ర్యాపిడ్‌ ఆంటీజన్‌ టెస్టుకి రూ.750 మించి వసూలు చేయొద్దని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఆర్టీపీసీఆర్ ద్వారా చేసే పరీక్షకు రూ.2800 మించి వసూలు చేయొద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది. Also read: Sonu Sood: చంద్రబాబు అభినందనకు సోనూసూద్ ఏమన్నాడంటే..

ప్రతి ల్యాబ్‌‌లల్లో చేసే పరీక్షలను ఐసీఎంఆర్‌ లాగిన్‌లో డేటాను క్రమం తప్పకుండా నమోదు చేయాలని స్పష్టం చేసింది. ప్రైవేట్‌ ఎన్‌ఏబీహెచ్‌ ఆస్పత్రులు, ఎన్ఏబిఎల్‌ ల్యాబ్‌లు పరీక్షల నిర్వహణకు ముందుగా నోడల్ అధికారి అనుమతి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్‌లల్లో జరిగే పరీక్షలు, ధరలను పర్యవేక్షించాల్సిందిగా జిల్లా వైద్యాధికారులకు సూచించింది. Also read: SBI Jobs: డిగ్రీ అర్హతతో 3,850 బ్యాంకింగ్ ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్‌ ( Andhra pradesh ) లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య లక్షకు చేరువలో ఉండగా.. మరణాల సంఖ్య వేయి దాటింది. Also read: AP: చంద్రబాబుది పైశాచిక ఆనందం: మంత్రి ఆళ్లనాని

Trending News