SBI Jobs: డిగ్రీ అర్హతతో 3,850 బ్యాంకింగ్ ఉద్యోగాలు

కరోనా లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచి తీవ్ర నిరాశతో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త.. అదికూడా బ్యాంకింగ్ పోస్టుల కోసం ప్రిపేర్ అవుతున్న వారికే గుడ్‌న్యూస్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( SBI ) దేశవ్యాప్తంగా భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 

Updated: Jul 27, 2020, 12:43 PM IST
 SBI Jobs: డిగ్రీ అర్హతతో 3,850 బ్యాంకింగ్ ఉద్యోగాలు
File photo

RECRUITMENT OF CIRCLE BASED OFFICERS: కరోనా లాక్‌డౌన్ (Corona lockdown) మొదలైనప్పటి నుంచి తీవ్ర నిరాశతో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త.. అదికూడా బ్యాంకింగ్ పోస్టుల కోసం ప్రిపేర్ అవుతున్న వారికే గుడ్‌న్యూస్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( SBI ) దేశవ్యాప్తంగా భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CIRCLE BASED OFFICERS) పోస్టులను ఎస్‌బీఐ భర్తీ చేస్తోంది. ఇందులో భాగంగా మొత్తం 3,850 ఖాళీలను ప్రకటించింది. ఇందులో తెలంగాణ సర్కిల్‌లో 550 ఖాళీలు ఉన్నట్లు ప్రకటించింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఎస్‌బీఐ అఫిషియల్ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. Also read: Govt Jobs: గురుకులాల్లో నాన్ టీచింగ్ పోస్టులు

తెలంగాణతో పాటు చత్తీస్‌గఢ్, తమిళనాడు, గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్ర, గోవా తదితర రాష్ట్రాల్లో మొత్తం 3,850 పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 జూలై 27 సోమవారం ప్రారంభమైంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2020 ఆగస్ట్ 16 చివరి తేదీ. డిగ్రీ అర్హతతో ఈ ఖాళీలను ఎస్‌బీఐ భర్తీ చేయనుంది. దరఖాస్తుదారులు https://recruitment.bank.sbi/crpd-cbo-2020-21-20/apply/register ఈ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో నింపవలసి ఉంటుంది.

ఏ సర్కిల్‌లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుసుకోండి..
అహ్మదాబాద్ - 750 ఖాళీలు
బెంగళూరు - 750 ఖాళీలు
భోపాల్ -296 ఖాళీలు
ఛత్తీస్‌గఢ్ -104 ఖాళీలు
చెన్నై -550 ఖాళీలు
హైదరాబాద్ -550 ఖాళీలు
జైపూర్ -300 ఖాళీలు
మహారాష్ట్ర -517 ఖాళీలు
గోవా -33 ఖాళీలు ఉన్నాయి. 

Nithin Wedding Photos: హీరో నితిన్, షాలినిల పెళ్లి వేడుక ఫొటోలు