/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

AP three capital's: అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ( AP Govt ) హైకోర్టు ( AP High Court ) నుంచి మరోసారి షాక్ తగిలింది. మూడు రాజధానులపై హైకోర్టు తాజాగా స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఆమోదిస్తూ గవర్నర్ ఇచ్చిన గెజిట్‌పై మంగళవారం స్టేటస్ కో విధించింది. అయితే.. కౌంటర్‌ దాఖలుకు పది రోజుల గడువు కావాలని ప్రభుత్వ తరపు న్యాయవాది కోరడంతో.. అప్పటి వరకు యథాతధ స్థితిని కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు తదుపరి విచారణను ఆగస్టు 14కు వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. Also read: AP: సెప్టెంబర్ 5 నుంచి స్కూల్స్ పారంభం

రాజ్ భవన్, సీఎం కార్యాలయం, సచివాలయాలను అమరావతి నుంచి తరలించకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారించిన హైకోర్టు.. గవర్నర్ గెజిట్‌పై స్టేటస్ కో విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. Also read: AP: వరుస ప్రమాదాలు.. సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులకు జులై 31న గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్రవేశారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లుతో పాటు సీఆర్డీఏ రద్దు బిల్లును కూడా గవర్నర్ ఆమోదించారు. దీంతో విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా.. అమరావతి శాసన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా మారనున్నాయి. అయితే ఆగస్టు 15 నాటికి అన్ని కార్యాలయాలను విశాఖకు తరలించాలని భావిస్తున్న వేళ ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది.  5846 కానిస్టేబుల్ జాబ్స్‌.. ఇంటర్ అర్హతతో ఇలా అప్లై చేయండి

Section: 
English Title: 
Andhra Pradesh high court stays governor gazette on three capital
News Source: 
Home Title: 

Andhra Pradesh: హైకోర్టు నుంచి ప్రభుత్వానికి షాక్

Andhra Pradesh: హైకోర్టు నుంచి ప్రభుత్వానికి షాక్
Caption: 
Representational Image
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Andhra Pradesh: హైకోర్టు నుంచి ప్రభుత్వానికి షాక్
Publish Later: 
No
Publish At: 
Tuesday, August 4, 2020 - 17:11