Water From Nallammaddi Tree In West Godavari: ప్రస్తుతం సమ్మర్ సీజన్ నడుస్తోంది. ఎండలు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఉదయం పూట కూడా బైటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. మనం కొన్నిసార్లు అడవులలోకి వెళ్లినప్పుడు చెట్ల నుంచి తెల్లని ద్రావణం బైటకు రావడం గమనిస్తుంటాం. కొన్నిసార్లు అది తెల్లగా, బంకలాగా ధారగా వస్తుంటుంది. వేప చెట్టుకుకూడా ఇలా ధారగా ద్రావణం బైటకు వచ్చిన ఘటనలుకూడా వార్తలలో నిలిచాయి. చెట్లు తమ వేర్లద్వారా భూమిలో ఉన్న నీళ్లను తాగి, వేరు, కాండం, ఆకులకు భూమిలోని పోషకాలను చేరవేస్తుంటాయి. ఇదిలా ఉండగా.. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగినఅరుదైన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అటవీ ప్రాంతంలో కనిపించిన అరుదైన జల ధార వృక్షం
పాపికొండల నేషనల్ కింటుకూరు అటవీ ప్రాంతంలోని బేస్ క్యాంపు పరిశీలనకు వెళ్లిన అటవీ అధికారులను కనివిప్పు చేసిన నల్లమద్ది చెట్టు.
నల్లమద్ది చెట్టు నుండి సుమారు 20 లీటర్ల వరకు నీరు వస్తుందని అధికారులు వెల్లడి. pic.twitter.com/5C7qmYB6an
— Telugu Scribe (@TeluguScribe) March 30, 2024
ఒక చెట్టు నుంచి ధారగా నీళ్లు బైటకు ఉబికి వస్తున్నాయి. మనం బోర్ల నుంచి,బోరింగ్ లనుంచి నీళ్లు వచ్చిన ఘటనలు అనేకం చూశాం. అదే విధంగా కొన్నిసార్లు వర్షాకాలంలో మూసుకుపోయిన బోర్ల నుంచి సైతం నీళ్లు పైకి వస్తుంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఫారెస్టు అధికారులు ఒక చెట్టుకు కొడవలితో వేటు వేసినప్పపుడు దాన్నుంచి నీళ్లు పొంగిబైటకు వస్తుంది.
సాధారణంగా నీళ్లు అనేవి నెల నుంచి పైకి వస్తుంటుంది. మనం బోర్లు వేసినప్పుడు, బావిలో నుంచి నీళ్లను బైటకు వచ్చేలా చేసుకుంటాం. కానీ ఇక్కడ మాత్రం ఒక చెట్టునుంచి నీళ్లు ధారగా బైటకు వస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని పాపికొండల్లో అరుదైన ఘటన జరిగింది. కింటుకూరు అటవీ ప్రాంతంలో ఓ నల్లమద్ది చెట్టు నుంచి జలధార ఉప్పొంగుతున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు.
దీంతో ఉన్నతాధికారులు అక్కడికి చేరుకున్నారు. వారంతా చూస్తుండగానే.. నల్లమద్ది చెట్టుకు గొడ్డలితో రంధ్రం చేయగా, నీళ్లు ఉబికివచ్చాయి. ఈ దృశ్యాన్ని అధికారులు తమ కెమెరాల్లో రికార్డు చేశారు. ఇక ఈ నల్లమద్ది వృక్షం నుంచి సుమారు 20 లీటర్ల వరకు నీళ్లు వస్తాయని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు బాబోయ్ ఇదేంది అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook