బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తీవ్రమౌతోంది. రానున్న 24 గంటల్లో అల్పపీడనంగా మారనుంది. మరోవైపు ఈ నెల 20 తరువాత బంగాళాఖాతంలో సూపర్ సైక్లోన్ హెచ్చరిక కూడా ఉండటంతో ఆందోళన రేగుతోంది.
ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇవాళ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వచ్చే 24 గంటల్లో అల్పపీడనంగా మారనుంది. క్రమంగా పశ్చిమ వాయువ్యదిశగా కదులుతూ...ఈ నెల 22వ తేదీకు వాయుగుండంగా మారనుంది. అక్కడి నుంచి మరింతగా బలపడి తుపానుగా మారే సూచనలున్నాయని ఇప్పటికే ఐఎండీ సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ పరిస్థితుల కారణంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
రానున్న మూడ్రోజులు కూడా రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.కొన్ని ప్రాంతాల్లో ఉరుములుతో కూడిన వర్షాలు పడవచ్చు. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తరాంధ్రలో మాత్రం భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది.
Also read: Pawan Kalyan Counter: అదే వ్యూహంతో వచ్చారు..ఏం చేసుకుంటారో చేసుకోండి..పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook