Pawan Kalyan Strong Counter to YSRCP: విశాఖపట్నం పర్యటన అర్ధాంతరంగా ముగియడంతో స్పెషల్ ఫ్లైట్లో గన్నవరం వివాహం విమానాశ్రయానికి చేరుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ అద్భుతమైన పాలన అందించి ఉంటే నేను కూడా ఆనందించే వాడిని కానీ ప్రజలను రెచ్చగొట్టడానికి మాత్రమే ఈ మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకి తీసుకువచ్చారని విమర్శించారు.
వైసీపీ నాయకులు నోరు హద్దులో ఉండదని వ్యక్తిగత దోషములకు వారు పాల్పడుతున్నారని కానీ వారి ఉడత ఊపుల్లకు తాటాకు చప్పుళ్ళకు ఎవరూ భయపడే వాళ్ళు లేరని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రభుత్వంలో ఉండి వైసీపీ గర్జనలు చేయడం ఏమిటో అర్థం కావడం లేదు, గర్జన చేసేది కడుపు మండిన వాళ్ళు కదా అని పవన్ ప్రశ్నించారు. అసలు మంత్రుల మీద దాడులు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించిన ఆయన అసలు కోడి కత్తి దాడి ఎలా జరిగిందో ఇప్పటికీ అర్థం కాని ఒక ప్రశ్న గానే మిగిలిపోయిందని అన్నారు.
అసలు విశాఖ ఘటనలో సంబంధం లేని వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారని పేర్కొన్న పవన్ కళ్యాణ్ మా జనవాణి కార్యక్రమానికి హాజరవడానికి వచ్చిన వాళ్ళని అర్ధరాత్రి అరెస్టు చేశారని అన్నారు. జనసేనకు మద్దతుగా నినాదాలు చేస్తే హత్యాయత్నం కేసులు పెడుతున్నారు కానీ ఒకప్పుడు రాజకీయ పార్టీల కార్యాలయాల మీదకి వెళ్లి వైసీపీ నాయకులు దాడులు చేస్తే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని దానికి భావ ప్రకటన స్వేచ్ఛ పేరు పెట్టారని అన్నారు.
ఒక ఐపీఎస్ అధికారి నాతో వచ్చి గొడవ పడే స్థాయికి దిగజారారంటే ఇలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఉండటం బాధాకరమని పవన్ అన్నారు. కేవలం నన్ను రెచ్చగొట్టి అరెస్టు చేద్దామని వ్యూహంతోనే కొంతమంది పోలీసులు వ్యవహరించారని పవన్ ఆరోపించారు. కులాల మధ్య చిచ్చులు పెట్టే రాజకీయాలు ఎన్ని రోజులు చేస్తారని ప్రశ్నించిన ఆయన కులాల మధ్య కుంపట్లు పెట్టొద్దని అన్నారు.
రైతుల పాదయాత్ర అడ్డుకోవడానికి మీకేం హక్కు ఉందని ప్రశ్నించిన పవన్ ఉత్తరాంధ్ర పై నిజంగా ప్రేమ ఉంటే మీరు చేస్తున్న కబ్జాలు ఆపమని సలహా ఇచ్చారు. వైసీపీ నాయకులు ఎన్ని దొంగ కేసులు పెట్టినా న్యాయం చేస్తూ న్యాయస్థానాలు ప్రజలకు అండగా నిలబడిందని, ఏపీ న్యాయవ్యవస్థకు తన ధన్యవాదాలు అంటూ పవన్ పేర్కొన్నారు.
మా విమర్శలు ఎప్పుడూ నిర్మాణాత్మకంగానే ఉంటాయని పవన్ అన్నారు. ఇక విశాఖ గర్జనకు ముందు టికెట్లు బుక్ చేసుకున్నామని కావాలని మూడు రాజధాని అంశాన్ని మరిచిపోతారని ఈ గొడవలు సృష్టించారని అన్నారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేదు అన్న వ్యక్తుల దగ్గర పోలీసులు పనిచేస్తున్నారని, ఐపీఎస్ లు క్రిమినల్స్ కి సలాం చేస్తుంటే దేశం ఎటు పోతుందో అర్థం కావడం లేదని అన్నారు. వైసీపీ నాయకులు ఏం చేసుకుంటారో చేసుకోండి, మేం గట్టిగా ఎదుర్కొంటామని పవన్ పేర్కొన్నారు.
Also Read: Unstoppable 2: ఆహాలో అన్నీ అన్‌స్టాపబుల్ అబద్ధాలేనా, అసలు ఆ రోజు ఏం జరిగింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook