Vijayawada Police Announces 2 lakh Cash Reward Info On Stone Attck: ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ పై దాడి ఘటన దేశంలో తీవ్ర దుమారంగా మారింది. ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. పోలీసులకు ఆదేశాలను జారీచేసింది. ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేయాలని ఆదేశించింది. విజయవాడలో ఎన్నికల ప్రచారంలో ఉండగా.. చీకట్లో ఒక్కసారిగా బలమైన రాయి ఆయనవైపు దూసుకొని వచ్చింది. అది నేరుగా జగన్ ఎడమ కంటి నుదిటి పై భాగంలో తాకింది. దీంతో లోతుగా బలమైన గాయమైంది. దీనితో వైఎస్ జగన్ ఒక్కసారిగా విలవిల్లాడిపోయారు. ఆయన పక్కన ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లికి కన్నుకు కూడా బలమైన గాయమైంది. దీంతో వెంటనే బస్సులోపలికి తీసుకెళ్లి ఇద్దరికి కూడా వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు.
గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గారి పై దాడి చేసిన వారి గురించి కచ్చితమైన వివరాలు తెలిపిన వారికి రూ 2,00,000 /- నగదు బహుమతి ఇవ్వబడును.#identification #CashReward #Reward #Information #investigation #vijayawadacity #NTRDistrict #AndhraPradeshPolice pic.twitter.com/RFf2QKMJs4
— Vijayawada City Police (@VjaCityPolice) April 15, 2024
అంతేకాకుండా.. సీఎం జగన్ కు మూడు కుట్లు కూడా పడినట్లు తెలుస్తోంది. ఇది ముమ్మటికి జగన్ ను అంతం చేయాలని, టీడీపీ, జనసేన పన్నిన కుట్రగా వైఎస్సార్సీపీ నేతలు అభివర్ణించారు. అంతేకాకుండా.. సీఎం జగన్ కు ప్రజల్లో వస్తున్న ఆదరణచూసి ఓర్వలేక ఇలాంటి నీచపు రాజకీయాలు చేస్తున్నారంటూ, వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా వెంటనే నిందితులపై చర్యలు తీసుకొవాలని, వైసీపీ నాయకులు, శ్రేణులు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఘటనపై సమగ్రవిచారణ జరిపి వివరణ ఇవ్వాలని, విజయవాడు పోలీసులకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది.
ముఖ్యంగా ఘటన జరిగినప్పుడు ఆ ప్రాంతంలో కరెంట్ లేకపోవడం,సీసీ కెమెరాలో పరర్ సప్లై లేకపోవడం వల్ల దర్యాప్తుకు పోలీసులకు ఇబ్బందిగా మారింది. పోలీసులు... డ్రోన్ల సహాయంతో ఆ ప్రదేశమంతా జల్లెడపడుతున్నారు. అక్కడున్న వారి వెలి ముద్రలు కూడా సేకరించారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం విజయవాడ పోలీసుల తాజాగా, సీఎం జగన్ పై దాడి ఘటనకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారంను తెలియజేస్తే రూ. 2 లక్షల రూపాయల నజరాన ఇస్తామని ప్రకటించారు.
Read More: CM YS Jagan: సీఎం జగన్ పై రాళ్లు విసిరిన ఆకతాయిలు.. ఎడమ కంటి పై భాగంలో తీవ్ర గాయం..
విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ అధికారులు ఈ ప్రకటన చేశారు. ఘటనకు సంబంధిన వీడియోలు, ఎలాంటి సమాచారమైన ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఒక వేళ ఎవరికైన దీని గురించి సమాచారం తెలిస్తే వెంటనే ఈ కింది నంబర్లకు కాల్ చేయాలంటూ కూడా వివరాలను వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter