పరిపాలనకు పట్టుగొమ్మలు స్థానిక సంస్థలు. స్థానిక సంస్థల సంస్కరణలు మెరుగ్గా ఉంటే రాష్ట్రాల పరిస్థితి బాగుంటుంది. ఏపీ,మధ్యప్రదేశ్ రాష్ట్రాలు అదే పని చేశాయి. కేంద్రం నుంచి ప్రశంసలందుకున్నాయి.
స్థానిక సంస్థల్లో సంస్కరణలనేవి చాలా కీలకం..అత్యవసరం కూడా. ఆంధ్రప్రదేశ్ ( AP ) , మధ్య ప్రదేశ్ ( MP ) రాష్ట్రాలు స్థానిక సంస్థల్లో చేసిన సంస్కరణలు ( Best reforms in local bodies ) సత్ఫలితాలనిచ్చాయి. మెరుగైన ప్రజల ఆరోగ్యం, పారిశుద్ధ్య నిర్వహణ, స్థానిక సంస్థల ఆర్ధిక వనరుల్ని బలోపేతం చేయడం, మెరుగైన పౌర సేవల్లో ఈ రెండు రాష్ట్రాలు చాలా బాగా పని చేశాయని కేంద్రం గుర్తించింది. స్థానిక సంస్థల సంస్కరణల్లో ఏపీ, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలు నెంబర్ వన్ స్థానంలో నిలిచాయని కితాబిచ్చింది కేంద్ర ప్రభుత్వం ( Central Government ).
ఇందులో భాగంగా మరింతగా రుణ సౌకర్యానికి అనుమతిచ్చింది. ఏపీకు 2 వేల 525 కోట్ల రూపాయలు, మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి 2 వేల 373 కోట్ల రూపాయల రుణ సౌకర్యాన్ని కల్పించింది కేంద్ర ప్రభుత్వం. కరోనా సంక్షోభం ( Corona pandemic ) నేపధ్యంలో రాష్ట్రాల జీఎస్డీపీపై 2 శాతం అదనంగా రుణం తీసుకునే సౌకర్యం అందించింది. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నాలుగు సంస్కరణల్ని అమలు చేసిన రాష్ట్రాలకు మాత్రమే ఈ రుణ సౌకర్యం అవకాశముంటుంది. ఆంధ్రప్రదేశ్ ఈ సంస్కరణల్ని విజయవంతంగా అమలు చేసింది.
Also read: Union Cabinet Meet: ఎస్సీ విద్యార్ధులకు వరాలు జల్లు..కీలక నిర్ణయాలు