ప్రతిపక్షాలు చెబుతున్నట్లు తాను ఎప్పుడు ప్రత్యేక హోదా విషయంలో రాజీపడలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలుపుతూ చంద్రబాబు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోదాకు సమాన స్థాయి ప్యాకేజీ ఇస్తానంటేనే తాను ఒప్పుకున్నానని పేర్కొన్నారు. ఐదేళ్ల లోపు ప్యాకేజీ నిధులు ఇస్తామన్న కేంద్రం ఇప్పటి వరకు ఇవ్వలేకపోయింది. ప్యాకేజీపై కూడా కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ దీన్ని అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం. హోదాకు సమాన స్థాయి ప్యాకేజీ ఇవ్వలేకుంటే ఊరుకునేది లేదన్నారు. ప్యాకేజీ ఇవ్వకుంటే.. ప్రజలు అడుగుతున్న హోదానే కేంద్రం ఇవ్వాలని తాము కోరుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు.
ఏపీ బీజేపీ నేతలపై చంద్రబాబు ఫైర్
విభజన సయయంలో ఏపీకి కాంగ్రెస్ అన్యాయం చేసింది. బీజేపీ అయినా న్యాయం చేస్తుందని బీజేపీతో చేయికలిపాం తప్పితే మరోక ప్రయోజనం లేదు. ఏపీ ప్రయోజనాలే తమకు తొలి ప్రాధాన్యమని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీ ప్రయోజనాల కోసం బీజేపీ నేతల కూడా పోరాడితే హర్షిస్తాం తప్పితే..సమస్య పరిష్కారంపై కాకుండా తనపై ఎదురదాడి చేస్తే ఊపేక్షించేదిలేదని చంద్రబాబు ఏపీ బీజేపీ నేతలకు హితవు పలికారు.