ఏపీకి ప్రత్యేక హోదాపై మరోసారి కన్నా కీలక వ్యాఖ్యలు

ఏపీకి ప్రత్యేక హోదాపై మరోసారి కన్నా కీలక వ్యాఖ్యలు

Updated: Oct 26, 2019, 08:26 AM IST
ఏపీకి ప్రత్యేక హోదాపై మరోసారి కన్నా కీలక వ్యాఖ్యలు
ఏపీ బీజేపి చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఫైల్ ఫోటో

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాపై ఏపీ బీజేపి చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి వీలుకాదని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ స్పష్టంచేశారు. అయినప్పటికీ రాజకీయ పార్టీలు వాస్తవాలను దాచిపెట్టి హోదా అంశాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నాయని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఏపీలో 2024 నాటికి బీజేపీనే ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని కన్నా ధీమా వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానంపై విమర్శలు గుప్పించిన కన్నా.. రాష్ట్ర ప్రభుత్వం అసమర్ధత వల్లే ఇసుక సమస్య ఏర్పడిందని ఆరోపించారు. నిర్మాణరంగంపై ఆధారపడిన కూలీల కుటుంబాలకు రూ.10 వేలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏదేమైనా.. రాష్ట్రాభివృద్ధికి అన్ని పార్టీలు కలిసి రావాలని కన్నా లక్ష్మీనారాయణ ఇతర రాజకీయ పార్టీలకు విజ్ఞప్తిచేశారు.

ఏపీకి బీజేపి రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ఆయన స్పందించడం ఇదేం మొదటిసారి కాదు. గతంలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించిన కన్నా.. ఇక ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యపడదని తేల్చిచెప్పేశారు.