జగన్ వస్తే..కేసీఆర్ పెత్తనం తప్పదంటున్న చంద్రబాబు

తెలంగాణ సీఎం కేసీఆర్ తో లింక్ పెడుతూ వైసీపీ అధినేత జగన్ పై ఏపీ సీఎం  చంద్రబాబు మరోమారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు

Last Updated : Mar 26, 2019, 11:45 AM IST
జగన్ వస్తే..కేసీఆర్ పెత్తనం తప్పదంటున్న చంద్రబాబు

తెలంగాణ సీఎం కేసీఆర్ తో లింక్ పెడుతూ వైసీపీ అధినేత జగన్ పై ఏపీ సీఎం చంద్రబాబు మరోమారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం పార్టీ శ్రేణలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించిన చంద్రబాబు..కేసీఆర్ తో దోస్తీ అంశాన్ని ప్రజల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ‘దొంగ వస్తున్నాడు జాగ్రత్త’ అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఈ సందర్భంగా పార్టీ నేతలకు ఆదేశించారు. కేసీఆర్‌తో జగన్ కుమ్మక్కును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తోచిన విధంగా నిరసనలు తెలపాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు సూచించారు

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న కేసీఆర్ తో జగన్ ఎలా దోస్తీ చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంపై పెత్తనం చలాయించేందుకే కేసీఆర్..జగన్ కు సహకరిస్తున్నారని విమర్శించారు.  రాష్ట్రంపై బయటి వ్యక్తులు పెత్తనం చేద్దామని చూస్తుంటే ఊరుకుంటామా ? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవరించే వ్యక్తితో కలిస్తే తప్పేంటి అని జగన్ అంటున్నాడంటే.. అతడి వ్యక్తిత్వం ఏమిటో అర్థమవుతోందని చంద్రబాబు విమర్శించారు

 

Trending News