Jagan Kuppam Tour: ఢిల్లీలో చక్రం తిప్పిన బాబు కుప్పానికి నీళ్లివ్వలే.. వెన్నుపోటే నాయకుడని సీఎం జగన్ ఫైర్

Jagan Kuppam Tour:  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అడ్డ కుప్పంలో పర్యటించారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. వైఎఎస్సార్ చేయూత మూడో విడత నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం జగన్.. ఏపీ ప్రజలకు మరిన్ని వరాలు ప్రకటించారు

Written by - Srisailam | Last Updated : Sep 23, 2022, 03:00 PM IST
Jagan Kuppam Tour: ఢిల్లీలో చక్రం తిప్పిన బాబు కుప్పానికి నీళ్లివ్వలే.. వెన్నుపోటే నాయకుడని సీఎం జగన్ ఫైర్

Jagan Kuppam Tour:  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అడ్డ కుప్పంలో పర్యటించారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. వైఎఎస్సార్ చేయూత మూడో విడత నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం జగన్.. ఏపీ ప్రజలకు మరిన్ని వరాలు ప్రకటించారు. జనవరి నుంచి పెన్షన్ పెంచుతామని ప్రకటించారు. ఏపీలో ప్రస్తుతం వృద్దులు, వితంతువులకు 2 వేల ఐదు వందల రూపాయల పెన్షన్ వస్తోంది. సీఎం జగన్ తాజా ప్రకటనతో జనవరి నుంచి పెన్షన్ 2 వేల 750 రూపాయలు ఇవ్వనున్నారు. ప్రతి ఏటా పెన్షన్ ను 250 రూపాయలు పెంచుతామని ఎన్నికల హామీ ఇచ్చారు జగన్. అందులో భాగంగానే రెండు విడతలుగా పెంచారు. వచ్చే జనవరి నుంచి మూడో విడతగా మరో 250 రూపాయలు పెంచనున్నారు.
కుప్పం సభలో చంద్రబాబును టార్గెట్ చేశారు సీఎం జగన్. ఢిల్లీలో చక్రం తిప్పానని గొప్పులు చెప్పుకునే చంద్రబాబు..  14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా తన సొంత నియోజకవర్గంలో కరువు సమస్యకు పరిష్కారం చూపలేదన్నారు. హంద్రీనీవా పనులకు అడ్డుకున్నారన్నారు. కమీషన్ల కోసం తనకు కావాల్సిన వాళ్లకు కాంట్రాక్టులు ఇచ్చారని ఆరోపించారు. కుప్పంకు మంచి నీళ్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు సీఎం జగన్. కుప్పంలో సరైన రోడ్లు కూడా లేవన్నారు. కుప్పానికి చేం చేయలేని చేతగాని నాయకుడు చంద్రబాబు అంటూ జగన్ మండిపడ్డారు. రెవెన్యూ డివిజన్‌ గురించి ఆలోచించలేదని.. ప్రజల నుంచి ఒత్తిడి రావడంతో రెవెన్యూ డివిజన్‌ కావాలని తనకు చంద్రబాబు లేఖ రాశారని జగన్ తెలిపారు. 

వచ్చె ఎన్నికల్లో కుప్పంలో విజయం సాధించి తీరుతామన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కుప్పం అభివృద్ధశిని జగన్‌ చేతల్లో చూపిస్తున్నారని అన్నారు. కుప్పం ప్రజలను చంద్రబాబు ఇంతకాలం మోసం చేశారన్నారు ఎమ్మెల్సీ భరత్. జగన్‌ వల్లే 33 ఏళ్ల తర్వాత చంద్రబాబుకు కుప్పంలో ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన వచ్చిందన్నారు. కుప్పం నియోజకవర్గ అభివృద్ధిపై చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు ఎమ్మెల్సీ భరత్.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News