AP Cabinet: ఆంధ్రపదేశ్ కేబినెట్ భేటీలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేబినెట్na మార్పులు.. చేర్పులు ఉంటాయని సీఎం వైఎస్ జగన్ చెప్పడంతో గత ఏడాదే నిర్ణయం తీసుకుంటారని అంత అకున్నారు. సీఎం వైఎస్ జగన్ మాత్రం ఆ దిశగా అడుగులు వేయలేదు. అయితే తాజాగా ఇప్పుడు ఆ అంశం తెరపైకి వచ్చింది. అతి త్వరలోనే కేబినెట్లో మార్పులు ఉంటాయని మంత్రులకు సీఎం జగన్ చెప్పినట్టు సమాచారం. కొంత మందికి ఇదే చివరి కేబినెట్ మీటింగ్ అని సీఎం వైఎస్ చెప్పినట్లు తెలిసింది.
మంత్రి పదవి నుంచి తప్పించిన వారు పార్టీ బలోపేతం కోసం పని చేయాలని సీఎం జగన్ సూచించారట. మీగతా నేతలకు జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు ఇవ్వనున్నట్టు చెప్పారని టాక్. రాబోయే ఎన్నికల్లో పార్టీని గెలిపించుకొని వస్తే మళ్లీ మంత్రులు కావొచ్చని చెప్పినట్టు సమాచారం.
ఈ సారి వాళ్లకు ఛాన్స్..
ఈ సారి కేబినెట్ మార్పులో ప్రాంతం, కులాల ఆధారంగా ఉంటుందని సీఎం జగన్ సంకేతాలు ఇచ్చారు. పార్టీలో చాలామంది నేతలు ఆశావాహులు ఉన్నారని..మంత్రి పదవిలో లేనంత మాత్రాన డిమోషన్‌గా అనుకోవద్దని సూచించారు. తాజాగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్‌తో మంత్రుల్లో టెన్షన్ మొదలైంది. ఎవరిని ఉంచుతారని..ఎవరిని తప్పిస్తారన్న అంశం ఆసక్తిగా మారింది. కేబినెట్ భేటీలో సీఎం వైఎస్ జగన్ చేసిన కామెంట్స్‌తో మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న వారిలో ఆశలు చిగురిస్తున్నాయి.
కొత్త జిల్లాల ఏర్పాటూ కారణమే..
ఏపీలో త్వరలో కొత్త జిల్లాలు ఏర్పాటు కాబోతుండటంతో సీఎం వైఎస్ జగన్ అందుకు అనుగుణంగా కేబినెట్ మార్పు కసరత్తు చేపడుతున్నట్టు సమాచారం. జిల్లాకు ఒక మంత్రి ఉండబోతున్నారని చెబుతున్నారు. ఉగాది నుంచి కొత్త జిల్లాల నుంచి పాలన ప్రారంభిస్తుడడంతో..అప్పుడే కేబినెట్ మార్పుకు ముహుర్తం ఉండొచ్చని ఉహాగానాలు వినిపిస్తున్నాయి.
Also read: Vijayasai Reddy: చంద్రబాబుపై విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు.. యూపీ ఫలితాలతో ముడిపెట్టి విమర్శలు..
Also read: AP Inter exams 2022: పాత పద్దతిలోనే ఇంటర్ ప్రాక్టికల్స్.. ప్రభుత్వ నోటిఫికేషన్ కొట్టేసిన హై కోర్టు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook