ఏపీ ప్రభుత్వం ( Ap Government ) అన్నదాతల సంక్షేమానికి పెద్ద పీట వేస్తోంది. రైతుల ప్రయోజనాల కోసం వినూత్న పథకాల్ని ప్రవేశపెడుతోంది. ఇప్పుడు మరో పథకాన్ని ప్రారంభించారు ఏపీ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్.
రైతు సంక్షేమమే ప్రధాన ఎజెండాగా అధికారంలో వచ్చిన వైసీపీ ప్రభుత్వం ( Ycp Government ) అన్నదాతల కోసం ఇప్పటికే పలు పధకాల్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఇప్పుడు మరో పథకానికి శ్రీకారం చుట్టింది. వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని ( ysr zero interest crop loans scheme ) ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) ఇవాళ ప్రారంభించారు. ఇప్పటికే పంట రుణాలపై రైతులకు అందాల్సిన వడ్డీ రాయితీని పూర్తిగా చెల్లిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా 510 కోట్ల రూపాయల్ని 14 లక్షల 58 వేల మంది రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసినట్టు సీఎం జగన్ తెలిపారు. అక్టోబర్ నెలలో దెబ్బతిన్న పంటలకు రాయితీని విడుదల చేశామని చెప్పారు.
నెల రోజుల్లోపే 132 కోట్ల రూపాయల ఇన్ పుట్ సబ్సిడీ ( input subsidy ) విడుదల చేస్తున్నామని..ఖరీఫ్ పంట నష్టాలకు సంబధించిన ఇన్ పుట్ సబ్సిడీని చెల్లించినట్టు ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ చెప్పారు. పగ్గాలు చేపట్టిన 18 నెలల్లోనే 90 శాతం పైగా హామీల్ని నెరవేర్చామని గుర్తు చేశారు. గత ప్రభుత్వ రుణమాఫీ పథకాన్ని ఏ విధంగా అటకెక్కించిందో అందరికీ తెలుసని..అప్పటి సున్నావడ్డీకు సంబంధించిన 1180 కోట్ల రూపాయల్ని కూడా ఈ ప్రభుత్వమే చెల్లించనట్టు స్పష్టం చేశారు. ఎక్కడా లేని విధంగా ఏ సీజన్ లో పంట నష్టం జరిగితే..అదే సీజన్ లో రైతుల్ని ఆదుకునే కార్యక్రమం చేపట్టినట్టు జగన్ తెలిపారు.
ఒకవేల ఎవరైనా రైతుకు అర్హత ఉండీ..సబ్సిడీ అందకపోతే మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రైతుల కోసం ఉచిత బోర్లు వేయిస్తున్నామని..పగటిపూటే ఉచితంగా 9 గంటల విద్యుత్ ఇస్తున్నామన్నారు. భీమా కూడా రైతులకు ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. పంటల కొనుగోళ్ల కోసం ఇప్పటి వరకూ 3 వేల 2 వందల కోట్లు ఖర్చు చేశామని సీఎం జగన్ వెల్లడించారు. Also read: AP: వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వివాదాస్పద వ్యాఖ్యలు