AP CM YS Jagan condolences over Naini's Death: అమరావతి: తెలంగాణ మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి (Naini Narsimha Reddy) కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొంతకాలం నుంచి జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉద్యమనేత, మొట్టమొదటి తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పరిస్థితి విషమించి బుధవారం అర్ధరాత్రి 12.25 గంటలకు తుది శ్వాస విడవటం (Naini Narsimha Reddy Passes Away) తెలిసిందే. అయితే నాయిని నర్సింహారెడ్డి మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan condolences over Naini Narsimha Reddys Death) విచారం వ్యక్తంచేశారు. తెలంగాణ మాజీ మంత్రి నర్సింహారెడ్డి మరణం తనను కలచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాయిని కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. Also read: Telangana: మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
ఇదిలాఉంటే.. మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతి పట్ల ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ నాయిని తెలంగాణ ఉద్యమంలో, టీఆర్ఎస్ (TRS) పార్టీలో, ప్రభుత్వంలో కలిసి పని చేసిన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు అధికారిక లాంచనాలతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిని సీఎం కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే. చాలామంది మంత్రులు, ఎమ్మెల్యే ఈ సందర్బంగా నాయినితో ఉన్న అనుబంధాన్ని పంచుకోని ఆయన మరణం పట్ల విచారం వ్యక్తంచేశారు.
- Also Read : Naini Narsimha Reddy's death: మాజీ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి మృతి
-
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe