/telugu/photo-gallery/actress-sri-reddy-apology-and-emotional-letter-to-former-cm-ys-jagan-family-pa-180817 Sri Reddy Letters: జగనన్న సారీ..  ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. Sri Reddy Letters: జగనన్న సారీ.. ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. 180817

AP EAPCET: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(ఏపీఈఏపీసెట్‌) షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షల నిర్వహణ బాధ్యతలను కాకినాడ జేఎన్టీయూకు విద్యాశాఖ అప్పగించింది.  

ఆగస్టు 19, 20, 23, 24, 25 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్ష, సెప్టెంబర్‌ 3, 6, 7 తేదీల్లో వ్యవసాయ‌, ఫార్మసీ పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 120 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌(Minister Adimulpu Suresh) తెలిపారు. ఈ నెల 25న ఇంజనీరింగ్‌ ప్రాథమిక కీ(Key) విడుదల చేస్తామని మంత్రి పేర్కొన్నారు. 2,59,156 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారని,..కరోనా పాజిటివ్‌(Covid Positive) విద్యార్థులకు పరీక్షకు అనుమతి ఉండదని ఆయన స్పష్టం చేశారు.

Also Read:AP Vs Odisha :ఆంధ్రా– ఒడిశా మధ్య ముదురుతున్న సరిహద్దు వివాదం...కొఠియా గ్రామాల్లో అసలేం జరుగుతోంది?

జూన్‌ 25న ఏపీఈఏపీసెట్‌(AP EAPCET) నోటిఫికేషన్‌ విడుదలైంది. దరఖాస్తుల నమోదు పక్రియను జూన్‌ 26 నుంచి ఆన్‌లైన్‌ విధానం ద్వారా ప్రారంభించింది.  మౌలిక సదుపాయాల అందుబాటు, కొవిడ్-19 మహమ్మారి(Corona) పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ పరీక్షలను 16 సెషన్లలో నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. ఇందులో 10 సెషన్లు ఇంజినీరింగ్.. ఆరు సెషన్లు అగ్రికల్చర్(Agriculture), ఫార్మసీ(Pharmacy) అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు.

ఇప్పటికే ఇంటర్మీడియట్(Intermediate) పరీక్ష రద్దు చేసినందున ఈఏపీసెట్‌ మార్కుల ఆధారంగానే వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు వంద శాతం వెయిటేజీని ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈఏపీసెట్‌-2021(AP EAPCET-2021) పరీక్షకు మొత్తం 2,59,564 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 1,75,796 మంది అభ్యర్థులు ఇంజినీరింగ్, 83,051 మంది అగ్రికల్చర్‌ను ఎంపిక చేసుకున్నారు. 717 మంది ఇంజనీరింగ్(Engineering), అగ్రికల్చర్ విభాగాలు రెండింటినీ ఎంచుకున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
AP EAPCET-2021 Schedule released
News Source: 
Home Title: 

AP EAPCET: ఏపీఈఏపీసెట్‌-2021 షెడ్యూల్ విడుదల

AP EAPCET: ఏపీఈఏపీసెట్‌-2021 షెడ్యూల్ విడుదల..పరీక్షల నిర్వహణ బాధ్యత జేఎన్‌టీయూకు అప్పగింత!
Caption: 
ఏపీఈఏపీసెట్‌-2021 షెడ్యూల్ విడుదల(Zee news)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

ఏపీఈఏపీసెట్‌-2021 షెడ్యూల్ విడుదల

పరీక్షల నిర్వహణ బాధ్యత జేఎన్‌టీయూకు అప్పగింత

ఈ నెల 25న ఇంజనీరింగ్‌ ప్రాథమిక కీ విడుదల 
 

Mobile Title: 
AP EAPCET: ఏపీఈఏపీసెట్‌-2021 షెడ్యూల్ విడుదల
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Tuesday, August 17, 2021 - 17:51
Request Count: 
64
Is Breaking News: 
No