AP Vs Odisha :ఆంధ్రా– ఒడిశా మధ్య ముదురుతున్న సరిహద్దు వివాదం...కొఠియా గ్రామాల్లో అసలేం జరుగుతోంది?

AP Vs Odisha :ఆంధ్రా– ఒడిశా సరిహద్దులోని కొఠియా గ్రామాలు సమస్య రోజురోజుకూ జఠిలమవుతోంది. తాజాగా ఏపీ అధికారులను కొఠియా గ్రామాల్లోకి రాకుండా ఒడిశా అధికారులు అడ్డుకున్నారు. దీంతో వివాదం ముదిరింది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 17, 2021, 04:51 PM IST
  • ఆంధ్రా-ఒడిశా మధ్య ముదురుతున్న సరిహద్దు వివాదం
  • కొఠియా గ్రామాల్లోకి రాకుండా ఒడిశా అధికారులు బారికేడ్లు ఏర్పాటు
  • ఆందోళనలో గిరిజనులు
AP Vs Odisha :ఆంధ్రా– ఒడిశా మధ్య ముదురుతున్న సరిహద్దు వివాదం...కొఠియా గ్రామాల్లో అసలేం  జరుగుతోంది?

AP  Vs Odisha : ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని కొఠియా గ్రామాలపై ఒడిశా దూకుడు పెంచింది. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ పరిధిలోని  34 కొఠియా గ్రామాలను ఎలాగైనా గుప్పిటపట్టాలని ప్రణాళికలు రచిస్తోంది. ఏకంగా ఏపీ ఆనవాళ్లనే లేకుండాచేసేలా పన్నాగాలు పన్నుతోంది. ఏపీ ప్రభుత్వం(AP Govt) వేసిన రోడ్డును పెకలించేసి...ఒడిశా(Odisha) అధికారులు బీటీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. అంతేకాకుండా హడావుడిగా కొన్ని శాశ్వత భవనాలను కూడా నిర్మిస్తోంది అక్కడి ప్రభుత్వం. 

కొఠియా గ్రామాల్లో(Kotia  villages)  అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాలని చూసిన ప్రతిసారీ ఆంధ్ర ప్రజాప్రతినిధులు, అధికారులకు చేదు అనుభవమే మిగులుతోంది. సోమవారం జరగాల్సిన జగనన్న పచ్చతోరణం, సచివాలయ భవనాల నిర్మాణాల ప్రారంభం, విద్యాకానుకల పంపిణీ కార్యక్రమాలను మరోసారి ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు, నాయకులు, పోలీసులు అడ్డుకున్నారు. ఏపీ అధికారులు కొఠియా గ్రామాల్లో(kotia villages)  అడుగుపెట్టకుండా ఒడిశా(Odisha)  ప్రభుత్వం బారికేడ్లను ఏర్పాటు చేసి...రహదారులను మూసేసింది. భారీగా బలగాలను మోహరించింది. 

Also Read: Heavy Rains Alert: రానున్న 48 గంటల్లో ఏపీకు అతి భారీ వర్షాల ముప్పు

ఏంటీ వివాదం?
విజయనగరం జిల్లా(Vizianagaram) సాలూరు(Saluru)కు అటు, ఒడిశాలోని కోరాపుట్‌(Koraput) జిల్లాకు మధ్యలో కొఠియా గ్రూపు గిరిశిఖర గ్రామాలు మొత్తం 34 ఉన్నాయి. దాదాపు 15 వేల మంది జనాభా నివశిస్తున్నారు.  వారిలో 3,813 మంది ఒడిశాలోనూ ఓటర్లుగా గుర్తింపు పొందారు. 1936లో ఒడిశా, 1953లో ఆంధ్ర రాష్ట్రం(Andhra State) ఏర్పాటైనప్పుడు వారిని ఏ రాష్ట్రంలోనూ అంతర్భాగంగా గుర్తించలేదు. దీంతో ఆయా గ్రామాల కోసం ఇరు రాష్ట్రాలు 1968 నుంచి న్యాయపోరాటం చేస్తున్నాయి. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు(Supreme Court).. ఈ వివాదాన్ని పార్లమెంటులో తేల్చుకోవాలని సూచించింది. అంతవరకూ ఎవరూ ఆక్రమణలకు పాల్పడవద్దని 2006లో ఆదేశాలు ఇచ్చింది. 

కొఠియా గ్రామస్తులంతా ఆంధ్రాకి చెందినవారేననడానికి తగిన ఆధారాలు ఉన్నాయి. వారికి ఏపీ ప్రభుత్వం(Andhrapradesh) మంజూరు చేసిన రేషన్ కార్డులతో పాటు..ఆధార్ కార్డులు కూడా ఉన్నాయి. భూమి శిస్తు చెల్లింపునకు సంబంధించిన తామ్రపత్రాలను ఇటీవల కొటియా గ్రామస్తులు ప్రదర్శించారు. వారి పిల్లలు కూడా సాలూరు(Saluru) మండలంలోని కురుకూటి, అంటివలస, కొత్తవలస గ్రామాల్లోనున్న గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో  చదువుతున్నారు. కొఠియా గ్రామాల్లో ఒడిశా దూకుడుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర(MLA Rajanna Dora) తెలిపారు. 

ఆ గ్రామాల్లో అపార ఖనిజ సంపద
ఈ కొఠియా గ్రామాల కోసం రెండు ప్రభుత్వాలు పోరాడటానికి కారణం ఉంది. కొఠియా గ్రామాల్లో విలువైన ఖనిజ సంపద(Minerals) ఉంది.  మాంగనీస్‌(Manganese‌), బాక్సైట్‌(Bauxite‌) తదితర గనులున్నాయి.  కారణం ఏదైనా రెండురాష్ట్రాల ప్రభుత్వాలు కొఠియా గ్రామాలు తమవంటే తమవని వాదిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునేది లేదని చెబుతున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News