School Holidays 2024 In AP: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు మార్చ్ 18 నుంచి 30 వరకూ జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల 25 వేల మంది పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. ఓవైపు ఇంటర్ పరీక్షల్ని పగడ్బందీగా నిర్వహిస్తూనే మరోవైపు పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనికి సంబంధించి హాల్ టిక్కెట్లను కూడా విడుదల చేసింది ఏపీ విద్యాశాఖ. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్ www.bse.ap.gov.in నుంచి విద్యార్ధులు తమ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈనేపథ్యంలో పదవ తరగతి పరీక్షలకు కేంద్రాలుగా ఉన్నా స్కూళ్లకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. దాదాపు ఆరో రోజులపాటు సెలవులు రానున్నట్లు తెలుస్తోంది. అంటే పదో తరగతి పరీక్షలు ఈనెల 18 నుంచి 30 వరకు జరగనున్నాయి. ఆ స్కూళ్ల మిగతా క్లాసులవారికి ఏపీ విద్యాశాఖ ఆరురోజులపాటు సెలవులు ప్రకటించింది. బదులుగా రానున్న ఏప్రిల్ మొదటి 15 రోజులు క్లాసులు నిర్వహించనున్నారట.పదవ తరగతి పరీక్షలకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇదిలా ఉండగా మిగతా స్కూళ్లకు ఈనెల 18 నుంచి ఒంటిపూట బడుల నిర్వహణకు ఏపీ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది అంటే ఒంటిపూటబడులు ఉదయం 8 నుంచి 12.30 వరకు స్కూళ్లు సమయం ఉండనున్నాయి.
ఇదీ చదవండి: ఈ సీటు చాలా హాట్ గురూ.. మహిళా నేతకు చెక్ పెట్టేందుకు మాస్టర్ ప్లాన్..!
పదో తరగతి పరీక్షలు పగడ్బందీగా నిర్వహించేందుకు వీలుగా 156 ఫ్లయింగ్ స్క్వాడ్, 682 సిట్టింగ్ స్క్వాడ్‌లు సిద్ధమయ్యాయి. 130 కేంద్రాల్లో సీసీ కెమేరాలు సైతం అమర్చారు. విద్యార్ధులు తమ హాల్ టికెట్లను www.bse.ap.gov.in నుంచి నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కేవలం తమ పేరు, పుట్టిన తేదీ స్కూల్, జిల్లా వివరాలు నమోదు చేసి హాల్‌టికెట్లు పొందవచ్చు. పదవ తరగతి పరీక్షలు రోజూ ఉదయం 9.30 గంటల్నించి మద్యాహ్నం 12.45 గంటల వరకూ జరగనున్నాయి.
ఇదీ చదవండి: విశాఖపట్నం నుంచి మరో రెండు వందేభారత్ రైళ్లు
తేదీ | పరీక్ష |
మార్చి 18 | ఫస్ట్ లాంగ్వేజ్ |
మార్చి 19 | సెకండ్ లాంగ్వేజ్ |
మార్చి 21 | థర్డ్ లాంగ్వేజ్ |
మార్చి 23 | మేథ్స్ |
మార్చి 26 | ఫిజిక్స్ |
మార్చి 28 | బయాలజీ |
మార్చి 30 | సోషల్ స్టడీస్ |
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook