లెక్క తేడా ఉంటే రీపోలింగ్ కు ఆదేశాలు - ఈసీ

ఈసీ మార్గదర్శకాల గురించి ఎనికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది మీడియాతో మాట్లాడారు

Last Updated : Apr 30, 2019, 11:08 AM IST
లెక్క తేడా ఉంటే రీపోలింగ్ కు ఆదేశాలు - ఈసీ

వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ అంశంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి  గోపాలకృష్ణ ద్వివేది స్పందించారు. సచివాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ...ఈసీ ఆదేశాల మేరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో లెక్కించాల్సిన ఐదు వీవీప్యాట్ యంత్రాలను లాటరీ పద్దతిలో తొలుత ఎంపిక చేసి స్లిప్పులను లెక్కిస్తామన్నారు. ఈవీఎంలలో పోలైన ఓట్లతో, వీవీప్యాట్‌లలోని స్లిప్పులు సరిపోలిన తర్వాతే రిటర్నింగ్‌ అధికారి  ఫలితాలు వెల్లడిస్తారని స్పష్టం చేశారు. 

వీపీ ప్యాట్లలోని స్లిప్పులు కంటే... ఈవీఎంలలోని ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు రిటర్నింగ్‌ అధికారి రీపోలింగ్‌కు ప్రతిపాదించవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి  గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. రిటర్నింగ్ అధికారి ప్రతిపాదనను పరిశలించి అవసరమైతే రీపోలింగ్ కు అదేశించే అవకాశముంటున్నారు. అలాగే ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలు మొరాయిస్తే వాటిని పక్కన పెట్టి లెక్కింపు కొనసాగిస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి  గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.

Trending News