పలు రాష్ట్రాల్లో వివిధ కారణాల వల్ల ఖాళీ అయిన 4 ఎంపీ, 11 ఎమ్మెల్యే స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 11 అసెంబ్లీ స్థానాలకుగాను బీజేపీ 4 స్థానాలు, కాంగ్రెస్ స్థానాలు, ఇతరలు 2 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇక ఎంపీ స్థానాల విషయానికి వస్తే మొత్తం జరిగిన నాలుగు ఎంపీ స్థానాలకు బీజేపీ స్థానాల్లోనూ మహాకూటమి ఒక స్థానంలో ముందంజలో ఉన్నాయి. అధికార పార్టీకి ఇది కాస్త నిరాశజనకంగా ఉండగా బీజేపీయేతర కూటమిలో ఉత్సాహాన్ని ఇస్తోంది. అయితే అంతిమ ఫలితం వచ్చే వరకు ఏమీ చెప్పలేని పరిస్థితి.
గుజరాత్ ఎన్నికల్లో పటేల్ వర్గమంతా తమ వైపు ఉంటుందని ఆశించిన కాంగ్రెస్‌కు భంగపాటు ఎదురైంది. ఆశించిన స్థాయిలో ఆ వర్గం వారు కాంగ్రెస్ పార్టీని ఆదరించలేదు. పటేళ్ల ప్రాబల్యం అధికంగా ఉన్న సౌరాష్ట్రలో 42 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, ప్రస్తుతం అందుతున్న సరళిని బట్టి బీజేపీ 22, కాంగ్రెస్ 19 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇక్కడ కూడా బీజేపీకే అధిక ఓట్లు వచ్చినట్టు తెలుస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నిరాశ కనిపిస్తోంది.
గుజరాత్ కౌంటింగ్ ట్రెండ్ క్షణక్షణానికి మారుతూ ఉత్కంఠతను రేపుతున్నాయి. విజయం కాంగ్రెస్-బీజేపీల మధ్య దోబూచులాడోంది. ఆరంభంలో బీజేపీ వైపు ఉండగా..తర్వాత కాంగ్రెస్ వైపు వెళ్లింది..ఇంతలోనే మళ్లీ బీజేపీ వైపు మళ్లీంది. ప్రస్తుతం బీజేపీ 105 స్థానాల్లో ముందంజలో ఉండగా.. కాంగ్రెస్ 75 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. ట్రెండ్స్ ను బట్టి చూస్తుంటే, గుజరాత్ లో హోరాహోరీ పోరు జరిగిందనే విషయం అర్థమవుతోంది.
గుజరాత్ లో అధికార భాజపా ముందంజలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తోంది. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల ప్రకారం భాజపా 90 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. కాంగ్రెస్ 88 స్థానాల్లో ముందంజలో ఉంది. అయితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపాని వెనుకంజలో ఉండటం గమనార్హం. రాజ్‌కోట్ పశ్చిమ నియోజకవర్గంలో విజయ్ రూపానిపై కాంగ్రెస్ అభ్యర్థి ఇంద్రనీల్ రాజ్‌గురు ఆధిక్యంలో ఉన్నారు.కాంగ్రెస్, భాజపాల మధ్య పోటీ నువ్వా?, నేనా? అన్నట్లు ఉండటంతో ఇక్కడ ఎవరూ విజయం సాధిస్తారన్నదానిపై అందరిలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
హిమాచల్ ప్రదేశ్ లో కూడా బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోరు నువ్వా నేనా అనట్లుగా మారిపోయింది. కౌటింగ్ ప్రారంభమైన తొలి గంటలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చింది. అయితే తర్వాతి క్షణం నుంచి కాంగ్రెస్ ఊపందుకుంది. ఆధిక్యాన్ని 10 నుంచి 21కి ఎగబాగికింది. ప్రస్తుతం బీజేపీ 29 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది
హిమాచల్ లో ఎన్నికల కౌటింగ్ కొనసాగుతోంది. ఆరంభం నుంచే బీజేపీ ముందుంజలో ఉన్న పార్టీ గెలుపు దిశగా పయనిస్తోంది. కౌంటింగ్ ప్రారంభమైన గంట వ్యవధిలో బీజేపీ ఇంకా మెజార్టీకి రెండు అంకెలకు దూరంగా ఉంది. ప్రస్తుతం ఆ పార్టీ 33 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా ..కాంగ్రెస్ 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ముందు నుంచి ఇక్కడ బీజేపీ గెలుస్తుందనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ ఊహాగానాలకు బలం చేకూర్చే విధంగా ఫలితాలు వస్తున్నాయి. దీంతో ఇక్కడ బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
గుజరాత్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కౌంటింగ్ ప్రారంభమైన గంట వ్యవధిలో ప్రస్తుతం ఆ పార్టీ 87 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా ..కాంగ్రెస్ 70 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎన్నికల ప్రారంభానికి ముందు గుజరాత్లో బీజేపీ గెలుపు నల్లేరుపై నడకేనని అందరూ భావించారు. అయితే ఒక్కసారిగా గాలి కాంగ్రెస్‌వైపు మళ్లింది. దీంతో ప్రచారం హోరాహోరీగా సాగింది. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ ప్రధానిపై చేసిన ‘నీచ్’ వ్యాఖ్యలతో వాతావరణం మళ్లీ ఒక్కసారిగా మారిపోయింది. గాలి మళ్లీ బీజేపీ వైపు మళ్లింది.
హిమాచల్ లో ఎన్నికల కౌటింగ్ కొనసాగుతోంది. ఆరంభం నుంచే బీజేపీ ముందుంజలో ఉంది.కౌంటింగ్ ప్రారంభమైన అర్థగంట వ్యవధిలో ఆ పార్టీ 26 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా ..కాంగ్రెస్ 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ముందు నుంచి ఇక్కడ బీజేపీ గెలుస్తుందనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ ఊహాగానాలకు బలం చేకూర్చే విధంగా కౌంటింగ్ ప్రక్రియ కూడా అదే స్థాయిలో నడుస్తోంది.
గుజరాత్ లో ఎన్నికల కౌటింగ్ కొనసాగుతోంది. ఆరంభం నుంచే బీజేపీ ముందుంజలో ఉంది.కౌంటింగ్ ప్రారంభమైన అర్థగంట వ్యవధిలో ప్రస్తుతం ఆ పార్టీ 70 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా ..కాంగ్రెస్ 42 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎన్నికల ప్రారంభానికి ముందు గుజరాత్లో బీజేపీ గెలుపు నల్లేరుపై నడకేనని అందరూ భావించారు. అయితే ఒక్కసారిగా గాలి కాంగ్రెస్‌వైపు మళ్లింది. దీంతో ప్రచారం హోరాహోరీగా సాగింది. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ ప్రధానిపై చేసిన ‘నీచ్’ వ్యాఖ్యలతో వాతావరణం మళ్లీ ఒక్కసారిగా మారిపోయింది. గాలి మళ్లీ బీజేపీ వైపు మళ్లింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.