AP Election Results 2024: ఆంధ్ర ప్రదేశ్ లో వార్ వన్ సైడ్.. మంత్రులంతా మటాష్..

AP Election Results 2024: ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అన్నట్టుగా సాగుతోంది. గత ఎన్నికల్లో ఏపీలో వైసీపీకి  ఏకపక్షంగా విజయాన్ని అందించిన ప్రజలు.. ఈ సారి రివర్స్ లో ప్రతిపక్ష తెలుగు దేశం కూటమి విజయం దిశగా దూసుకుపోతుంది. అంతేకాదు సైకిల్ స్పీడు కు ఫ్యాన్ రెక్కలు తెగిపడ్డాయి. మెజారిటీ సీట్లలో మంత్రులు ఓటమి పాలయ్యారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 4, 2024, 10:56 AM IST
AP Election Results 2024: ఆంధ్ర ప్రదేశ్ లో వార్ వన్ సైడ్.. మంత్రులంతా మటాష్..

AP Election Results 2024: మెజారిటీ ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్పినట్టుగానే ఏపీలో వార్ వన్ సైడ్ అన్నట్టుగా సాగుతోంది. ఇప్పటికే తెలుగు దేశం పార్టీ కూటమి మెజారిటీ దిశను దాటి దూసుకుపోతుంది. తెలగు దేశం పార్టీ దాదాపు 127 స్థానాల్లో విజయం దిశగా అడుగులు వేస్తోంది. అటు జనసేన పార్టీ దాదాపు 19 సీట్లలో ఆధిక్యంలో ఉంది. అటు భారతీయ జనతా పార్టీ 7 సీట్లలో దూసుకుపోతుంది. మొత్తంగా ఏపీలో కూటమి దెబ్బకు ఫ్యాన్ రెక్కలు తెగిపడ్డాయి. గత ఎన్నికల్లో వైయస్ఆర్సీపీకి ఏక పక్షంగా అధికారం కట్టబెట్టన ప్రజలు ఈ సారి అదే తరహాలో తెలుగు దేశం కూటమికి ప్రజలు అధికారాన్ని అప్పగిస్తున్నారు.

మొత్తంగా బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి దెబ్బకు మెజారిటీ మంత్రులు ఓటమి దిశగా సాగుతున్నారు. నగరి నుంచి పోటీ చేసిన మంత్రి రోజా సమీప టీడీపీ అభ్యర్ధఇ  భాను ప్రకాష్ చేతిలో ఓటమి దిశగా దూసుకుపోతుంది. అు సత్తెనపల్లి నుంచి బరిలో దిగిన అంబటి రాంబాబు, టీడీపీ అభ్యర్ధి కన్నా లక్ష్మీ నారాయణ చేతిలో ఓటమి పాలు అయ్యే దిశగా ట్రెండ్ కొనసాగుతోంది. అటు మిగతా మంత్రులు  గుడివాడ అమర్ నాథ్, బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, చెల్లబోయన వేణుగోపాల్ సహా పలువురు మంత్రులు ఓటమి పాలయ్యారు. మొత్తంగా ఏపీలో వైసీపీకి కేవలం 20 సీట్లకు పరిమితమవుతుందా లేదా అనేది చూడాలి. 

ఇక చంద్రబాబు నాయుడు ఈ నెల 9న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలుగు దేశం వర్గాలు చెబుతన్నాయి. మొత్తంగా 1995, 1999, 2014లలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన చంద్రబాబు నాయుడు 4వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News