BJP Natitonal President: భారతీయ జనతా పార్టీ తదుపరి జాతీయ అధ్యక్షురాలిగా వసుంధరా రాజే నియమితులు కానున్నారా.. ? నరేంద్ర మోడీ, అమిత్ షా కూడా తదుపరి అధ్యక్షురాలిగా వసుంధరా పేరును ఫైనలైజ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు అందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేసినట్టు సమాచారం.
Kishan Reddy: రీసెంట్ గా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమిగా 400 సీట్లు సాధిస్తామన్న బీజేపీ వ్యూహం ఫలించలేదు. మొత్తంగా ఎన్డీయే 292 సీట్లకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో పార్టీని సంస్థాగతంగా ప్రక్షాలించే పనిలో పడింది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
BJP Telegu States : ఒక్కో వ్యక్తితో పాటు ఒక్కో పార్టీకి ఒక్కో లక్కీ నెంబర్ ఉంటుంది. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి రెండు రాష్ట్రాల్లో ఓ నెంబర్ లక్కీగా కలిసొచ్చింది. దీని గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.
BJP JP Nadda: తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అబ్ కీ బార్ 400 పార్ అన్న బీజేపీ నినాదం వర్కౌట్ కాలేదు. మొత్తంగా ఎన్టీయే కూటమి 300 లోపు సీట్లకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీకి జవసత్వాలు ఇవ్వడానికి పార్టీ అధ్యక్ష మార్పు ఉండబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Awadhesh Prasad: అయోధ్య రామ జన్మభూమి భారతీయ జనతా పార్టీ ఊపిరి ఒదిలిన కార్యస్థలం. అక్కడ రామ మందిరం కడతామని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అంతేకాదు అక్కడ ఎంతో భవ్యమైన రామ మందిరం నిర్మించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అలాంటి పవిత్ర స్థలంలో బీజేపీకి అక్కడి ఓటర్లు ఝలక్ ఇచ్చి ఎప్పీ అభ్యర్ధి అవదేశ్ ప్రసాద్ గెలిచి సంచలనం రేపారు.
AP Lok Sabha Elections 2024: అబ్ కీ బార్ 400 పార్ అన్న నినాదంతో ఎన్నికల బరిలో దిగిన భారతీయ జనత పార్టీకి ఉత్తరాది ఓటర్లు పెద్ద షాక్ ఇచ్చారు. కానీ అదే సమయంలో దక్షిణాదిలోని ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో మంచి సీట్లనే కట్టబెట్టారు. అంతేకాదు ఏపీలో కూటమితో కలిసి బరిలో దిగిన బీజేపీకి మంచి ఫలితాలే వచ్చాయి.
Lok Sabha Election Results 2024: లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో పలు సర్వే సంస్థలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి దాదాపు 350 నుంచి 400 వరకు సీట్లు వస్తాయని సర్వే సంస్థలు చెప్పాయి. అదే సమయంలో జీ న్యూస్ AI చెప్పిన ఎగ్జిట్ పోల్ సర్వే చెప్పినట్టుగా ఇపుడు ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. దీంతో మరోసారి జీ న్యూస్ AI సంస్థ చెప్పిన సర్వే సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
AP Election Results 2024: ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అన్నట్టుగా సాగుతోంది. గత ఎన్నికల్లో ఏపీలో వైసీపీకి ఏకపక్షంగా విజయాన్ని అందించిన ప్రజలు.. ఈ సారి రివర్స్ లో ప్రతిపక్ష తెలుగు దేశం కూటమి విజయం దిశగా దూసుకుపోతుంది. అంతేకాదు సైకిల్ స్పీడు కు ఫ్యాన్ రెక్కలు తెగిపడ్డాయి. మెజారిటీ సీట్లలో మంత్రులు ఓటమి పాలయ్యారు.
Lok Sabha Election Results 2024: దేశ వ్యాప్తంగా బీజేపీ నేతృత్వంలో ఎన్టీయే మ్యాజిక్ మార్క్ దాటినా.. వాళ్లు చెప్పినట్టుగా 400 దాటడం కష్టమే కనిపిస్తోంది. బీజేపీకి పట్టున్న యూపీ, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ కాస్త వెనకబడినట్టు ట్రెండ్స్ చెబుతున్నాయి. కానీ తెలంగాణలో బీజేపీ మాత్రం దూసుకుపోతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.