Indian Students in Ukraine: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్ధుల కోసం రంగంలో దిగిన ఏపీ ప్రభుత్వం

Indian Students in Ukraine: రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులో విద్యార్ధులు చిక్కుకుపోయారు. ముఖ్యంగా ఏపీకు చెందిన విద్యార్ధుల్ని సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రంగంలో దిగారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 24, 2022, 12:58 PM IST
  • ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణం
  • ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్ధుల్ని క్షేమంగా రప్పించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు
  • కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి లేఖ రాసిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్
Indian Students in Ukraine: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్ధుల కోసం రంగంలో దిగిన ఏపీ ప్రభుత్వం

Indian Students in Ukraine: రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులో విద్యార్ధులు చిక్కుకుపోయారు. ముఖ్యంగా ఏపీకు చెందిన విద్యార్ధుల్ని సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రంగంలో దిగారు. 

రష్టా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లో ఉద్యోగ, వ్యాపార, విద్య నిమిత్తం వెళ్లిన భారతీయుల్ని క్షేమంగా వెనక్కి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అటు తెలుగు విద్యార్ధులు కూడా ఉక్రెయిన్‌లో పెద్ద సంఖ్యలోనే చిక్కుకుపోయారు. ఉక్రెయిన్‌లో ఏపీకు చెందిన విద్యార్ధుల్ని క్షేమంగా వెనక్కి రప్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగంలో దిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా ఈ అంశాన్ని పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌కు ఇప్పటికే జగన్ లేఖ రాశారు. ఆ దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో తమను రక్షించాలంటూ అక్కడి విద్యార్ధులు ప్రభుత్వానికి సహాయం కోరిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. 

విద్యార్ధుల్ని స్వస్థలాలకు చేర్చేందుకు ఏపీ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ఉక్రెయిన్‌లోని ఏపీ విద్యార్దులు అక్కడి ఇండియన్ ఎంబసీను సంప్రదించాలని వైఎస్ జగన్ కోరారు. అక్కడి విద్యార్ధుల క్షేమ సమాచారం, పరిస్థితులపై ప్రభుత్వం విద్యార్ధుల్ని నేరుగా సంప్రదిస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్‌లోని భారత రాయబార్య కార్యాలయం తాత్కాలికంగా దేశం విడిచి పోవల్సిందిగా ఇండియన్స్‌కు సూచించింది. ఈ క్రమంలో తెలుగు విద్యార్ధుల్ని క్షేమంగా ఇండియా రప్పించేందుకు సహకరించాల్సిందిగా ప్రభుత్వం కోరింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం భారతీయుల్ని వెనక్కి రప్పించేందుకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసింది. ఉక్రెయిన్‌కు సంబంధించి తెలుగు విద్యార్ధుల సమాచారం కోసం ఢిల్లీలోని ఏపీ భవన్ లేదా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని అధికారులు సంప్రదించవచ్చని వైఎస్ జగన్ లేఖలో కోరారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానాల ద్వారా ఢిల్లీకు చేరుకునే విద్యార్ధులు స్వస్థలాలకు చేర్చేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 

Also read: Mekapati Goutham Reddy Funeral: ప్రభుత్వ లాంఛనాలతో మేకపాటి అంత్యక్రియలు...పాల్గొన్న సీఎం జగన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News