Ap Government: ఏపీలో నైట్ కర్ఫ్యూ అంటూ ప్రచారం జరిగింది. దీనిపై ప్రభుత్వం స్పందించింది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా, ఒమిక్రాన్ కేసుల పెరుగుతున్న క్రమంలో ఏపీలో నైట్ కర్ఫ్యూ ఉంటుందనే ప్రచారం జరిగిన క్రమంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్న నేపధ్యంలో దేశంలోని పలు రాష్ట్రాలు ఇప్పటికే వివిధ రకాల ఆంక్షలు విధిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధిస్తుండగా, మరికొన్ని రాష్ట్రాలు నిబంధనల్ని కఠినతరం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో నైట్ కర్ఫ్యూ విధించారంటూ సోషల్ మీడియా వేదికగా కొన్నిరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. నిన్నటి నుంచి వాట్సప్ గ్రూపుల్లో నైట్ కర్ఫ్యూ వార్త ట్రోల్ అవుతోంది. ఈ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం స్పందించింది. నైట్ కర్ఫ్యూపై స్పష్టత ఇచ్చింది.
రాష్ట్రంలో ఏ విధమైన నైట్ కర్ఫ్యూ విధించలేదని ప్రభుత్వం (Ap government) స్పష్టం చేసింది. సోషల్ మీడియా వేదికగా ఈ తరహా తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తున్నవారి గురించి ఆరా తీస్తున్నామని తెలిపింది. ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తే తప్ప ఇటువంటి వార్తల్ని నమ్మవద్దని వెల్లడించారు అధికారులు. అసత్య ప్రచారం చేస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అయితే కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించింది. వాస్తవానికి జనవరి 8 నుంచి అంటే నేటి నుంచి నైట్ కర్ప్యూ విధిస్తున్నట్టుగా ప్రచారం జరిగింది. కరోనా సంక్రమణ నేపధ్యంలో పక్కనున్న తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ (Night Curfew)అమలు చేస్తున్నారు. ఏపీలో కూడా నైట్ కర్ఫ్యూ అమల్లో రానుందని ప్రచారం అధికం కావడంతో ప్రభుత్వం స్పష్టం చేసింది. కర్ఫ్యూ లేదని తేల్చి చెప్పింది.
Also read: Family suicide in Vijayawada: విజయవాడలో దారుణం- తెలంగాణ కుటుంబం ఆత్మ హత్య!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook