Bank Holidays: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి సెలవులు జాబితా విడుదల చేసింది. రెండు, నాలుగవ శనివారాలు, నాలుగు ఆదివారాలతో కలిపి మొత్తం 13 రోజులు బ్యాంకులు పనిచేయవు. అందుకే జనవరి నెలలో బ్యాంకు పనులుంటే ముందే చెక్ చేసుకుని వెళ్లడం మంచిది. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది.
ఆర్బీఐ జనవరి నెల సెలవుల జాబితా విడుదల చేసింది. మొత్తం 13 రోజులు బ్యాంకులు పనిచేయవు. వీటిలో జాతీయ, ప్రాంతీయ సెలవులున్నాయి. ఈ సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారనున్నాయి. రెండవ, నాలుగవ శనివారాలు, నాలుగు ఆదివారాలు దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవుంటుంది. మిగిలినవి మారుతుంటాయి.
జనవరి 1 న్యూ ఇయర్ డే దేశమంతా సెలవు
జనవరి 2 ఐజ్వాల్, గ్యాంగ్‌టక్‌లో బ్యాంకులకు సెలవు
జనవరి 5 ఆదివారం సెలవు
జనవరి 6 గురు గోవింద్ సింగ్ జయంతి చండీగఢ్‌లో సెలవు
జనవరి 11 రెండవ శనివారం సెలవు
జనవరి 12 ఆదివారం సెలవు
జనవరి 14 మకర సంక్రాంతి గుజరాత్, బెంగళూరు, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, అస్సోం, ఉత్తరప్రదేశ్, ఒడిశా, కర్ణాటకలో సెలవు
జనవరి 15 తిరువళ్లూరు డే తమిళనాడులో సెలవు
జనవరి 16 ఉజావర్ తిరునాళ్లు తమిళనాడులో సెలవు
జనవరి 19 ఆదివారం సెలవు
జనవరి 23 నేతాజీ జయంతి పశ్చిమ బెంగాల్, ఒడిశా, అగర్తలలో సెలవు
జనవరి 25 నాలుగవ శనివారం సెలవు
జనవరి 26 ఆదివారం రిపబ్లిక్ డే సెలవు
సెలవు దినాల్లో భౌతికంగా బ్యాంకులు మూతపడినా ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు అన్నీ యధావిధిగా కొనసాగనున్నాయి. వ్యక్తిగతంగా బ్యాంకులో పనులు తప్ప మిగిలినవన్నీ కొనసాగనున్నాయి.
Also read: Bank Account Closure: రేపట్నించి ఈ బ్యాంకు ఎక్కౌంట్లన్నీ క్లోజ్, మీ ఎక్కౌంట్ ఉందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.