Good news : 25 లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీకి రంగం సిద్ధం

ఏపీ సర్కార్ ఇల్లు లేని నిరుపేదలకు గుడ్ న్యూస్ వినిపించింది. ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద 25 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ ప్రక్రియ ప్రారంభించేందుకు ఏపీ సర్కార్ సర్వం సిద్ధం చేసింది.

Last Updated : Mar 4, 2020, 04:34 PM IST
Good news : 25 లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీకి రంగం సిద్ధం

అమరావతి: ఏపీ సర్కార్ ఇల్లు లేని నిరుపేదలకు గుడ్ న్యూస్ వినిపించింది. ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద 25 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ ప్రక్రియ ప్రారంభించేందుకు ఏపీ సర్కార్ సర్వం సిద్ధం చేసింది. నేటి నుంచి అధికారులు లబ్ధిదారులకు ప్లాట్లను కేటాయింపులు చేయనున్నారు. అన్ని జిల్లాల్లో ఇప్పటికే లబ్ధిదారులను గుర్తించినందున.. లాటరీ పద్ధతి ద్వారా వారిని ఎంపిక చేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు సైతం జారీ అయ్యాయి. ఈ నెల 15 నుంచి లబ్ధిదారుల పేర్ల మీద ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించి.. 25న ప్లాట్ల రిజిస్ట్రేషన్ పట్టాలను లబ్ధిదారులకు అందజేయాలని ఏపీ సర్కార్ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఉగాది పండగలోగా ఈ ప్రక్రియ పూర్తి కావాల్సిందిగా సర్కార్ తమ ఆదేశాల్లో స్పష్టంచేసింది.
 
లబ్ధిదారులకు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండటం కోసం పూర్తిగా లే అవుట్ వేసిన ప్లాట్లనే అప్పగించాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News