Ap High Court: మంత్రి కొడాలి నానిపై ఎస్ఈసీ ఆదేశాల్ని కొట్టివేసిన హైకోర్టు

Ap High Court: ఆంధ్రప్రదేశ్  ఎన్నికల కమీషనర్‌కు మరోసారి భంగపాటు ఎదురైంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇచ్చిన ఆదేశాల్ని హైకోర్టు కొట్టివేసింది. మీడియాతో మాట్లాడేందుకు అనుమతిచ్చింది.

Last Updated : Feb 18, 2021, 02:18 PM IST
Ap High Court: మంత్రి కొడాలి నానిపై ఎస్ఈసీ ఆదేశాల్ని కొట్టివేసిన హైకోర్టు

Ap High Court: ఆంధ్రప్రదేశ్  ఎన్నికల కమీషనర్‌కు మరోసారి భంగపాటు ఎదురైంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇచ్చిన ఆదేశాల్ని హైకోర్టు కొట్టివేసింది. మీడియాతో మాట్లాడేందుకు అనుమతిచ్చింది.

ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికలు( Ap panchayat elections )ప్రారంభమైనప్పటి నుంచీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ( Sec nimmagadda ramesh kumar ) వర్సెస్ రాష్ట్ర మంత్రుల పంచాయితీ ఎక్కువవుతోంది. మంత్రుల్ని, ఎమ్మెల్యేలపై ఆంక్షలు విధించడం పరిపాటిగా మారింది. మొన్న పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ( Minister Peddireddy Ramachandra reddy ) బయటకు వెళ్లకుండా, మీడియాతో మాట్లాడకుండా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆంక్షలు విధించారు. దీన్ని సవాలు చేస్తూ మంత్రి పెద్దిరెడ్డి హైకోర్టును ఆశ్రయించగా..కోర్టు నిమ్మగడ్డ ఆదేశాల్ని కొట్టివేసింది. తరువాత ఎమ్మెల్యే జోగి రమేష్‌పై ఆంక్షలు విధించారు నిమ్మగడ్డ. ఇప్పుడు తిరిగి మంత్రి కొడాలి నాని ( Minister kodali nani )పై ఆంక్షలు విధిస్తూ..మీడియాతో మాట్లాడకూడదన్నారు. మంత్రి కొడాలి నాని సైతం హైకోర్టును ఆశ్రయించారు.

మీడియా సమావేశంలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారనేది నిమ్మగడ్డ అభియోగం. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ( High court )..మంత్రి కొడాలి నానిపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇచ్చిన ఆదేశాల్ని కొట్టివేసింది. మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడవచ్చని స్పష్టం చేసింది. అయితే మాట్లాడే సమయంలో సంయమనం పాటించాలని సూచించింది. ఎన్నికల్ని నిర్వహించేటప్పుడు ఎన్నికల కమీషనర్‌కు సర్వాధికారాలుంటాయని..కానీ వాక్ స్వాతంత్యాన్ని హరించేలా ఉత్తర్వులివ్వడం సరికాదని పిటీషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు ఎస్ఈసీ ఆదేశాల్ని కొట్టివేస్తూ ఉత్తర్వులిచ్చింది.

Also read: Visakha steel plant issue: స్టీల్‌ప్లాంట్ ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ భేటీ, అసెంబ్లీలో తీర్మానం ప్రకటన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News