Ap High court: వాలంటీర్ల విషయంలో తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

AP High Court: ఆంధ్రప్రదేశ్  మున్సిపల్ ఎన్నికలకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ జారీ చేసిన ఉత్తర్వులు వివాదాస్పదమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటీషన్‌పై విచారణ పూర్తి చేసి..తీర్పును రిజర్వ్‌లో ఉంచింది హైకోర్టు.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 2, 2021, 06:23 PM IST
Ap High court: వాలంటీర్ల విషయంలో తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

AP High Court: ఆంధ్రప్రదేశ్  మున్సిపల్ ఎన్నికలకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ జారీ చేసిన ఉత్తర్వులు వివాదాస్పదమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటీషన్‌పై విచారణ పూర్తి చేసి..తీర్పును రిజర్వ్‌లో ఉంచింది హైకోర్టు. 

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల( Ap municipal elections) ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ జారీ చేసే ఉత్తర్వులు ఎప్పటిలానే వివాదాస్పదమై కోర్టు మెట్లెక్కుతోంది. తాజాగా వాలంటీర్లను ఎన్నికల్లో జోక్యం చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని..వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవాలని కోరడం కొత్త వివాదానికి తెర తీసింది. ఎస్ఈసీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేసింది. వాలంటీర్ల సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ( Sec Nimmagadda Ramesh kumar) ఆదేశించడం ఏకపక్షమే కాకుండా  రాజ్యాంగ విరుద్ధమని, పంచాయితీ రాజ్ చట్ట నిబంధనలలు వ్యతిరేకమని ప్రభుత్వం వాదించింది. ఈ ఉత్తర్వుల్ని రద్దు చేయాలని ప్రభుత్వం కోరింది. ఈ పిటీషన్‌పై హైకోర్టు ( Ap high court) ధర్మాసనం విచారణ పూర్తి చేసింది. తీర్పు రిజర్వ్‌లో ఉంచింది.

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాల్ని వైసీపీ నేతలు, ప్రభుత్వ పెద్దలు తప్పుబట్టారు. పేదల సంక్షేమ పథకాలతో సంబంధమున్న వాలంటీర్ల ఫోన్ నెంబర్లను స్వాధీనం చేసుకోవాలనడంపై విమర్శలు రేగాయి. దీనివల్ల పేదలకు అందాల్సిన సంక్షేమ పధకాలకు ఆటంకం కలుగుతుందని స్పష్టం చేశారు.

Also read: Dadi Veerabhadra rao: హైకోర్టు అనుమతి లేకుండా ఎస్ఈసీ ఎలాంటి ఆదేశాలివ్వకూడదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News