ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు షాక్ ఇచ్చింది. పంచాయితీ ఎన్నికల షెడ్యూల్‌ను రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
పంచాయితీ ఎన్నికల ( Local body Elections ) విషయమై ప్రభుత్వానికి, ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు మధ్య చెలరేగిన వివాదానికి తెర పడింది. ప్రభుత్వ నిర్ణయంతో సంబంధం లేకుండా ఏకపక్షంగా పంచాయితీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసి ప్రభుత్వంతో పేచీ పెట్టుకున్నారు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ( Nimmagadda Ramesh kumar ). ఓ వైపు ఎన్నికల్ని బహిష్కరిస్తూ..మరోవైపు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది ప్రభుత్వం ( Ap Government ).
ఈ పిటీషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ( High court ).. ఎన్నికల కమీషన్ ఇచ్చిన ఉత్తర్వుల్ని రద్దు చేసింది. ఎన్నికల షెడ్యూల్‌ను ఏకపక్షంగా విడుదల చేసిందని..వ్యాక్సినేషన్ ప్రక్రియకు షెడ్యూల్ అవరోధంగా మారుతుందని..ప్రజారోగ్యమే ముఖ్యమని స్పష్టం చేసింది. ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికల షెడ్యూల్ ( Election Schedule )ను రద్దు చేస్తున్నామని..ఆర్టికల్ 14, 21 ప్రకారం ప్రజల జీవించే హక్కును కాపాడాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రభుత్వ వాదనతో పూర్తిగా ఏకీభవించిన కోర్టు ..ప్రభుత్వ సూచనల్ని ఎస్ఈసీ పట్టించుకోలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది.
Also read: AP: కోడ్ దాటుకుని..ప్రారంభమైన అమ్మఒడి పథకం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook