విజయవాడ: ఉపాధ్యాయ అభ్యర్థులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ నియామక పరీక్ష (DSC) కు మోక్షం లభించింది. ఏపీ మంత్రి గంటా ఈ రోజు దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొత్తం 7 వేల 675 టీచర్ పోస్టులకు సంబంధించి రేపు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయోపరిమితిని 49 ఏళ్లకు పెంపుతో పాటు జనరల్ కేటగిరి అభ్యర్థులకు వయోపరిమితి 44 ఏళ్లకు పెంచుతున్నట్లుగా గంటా వెల్లడించారు. ఏపీలో టెట్ కం టీఆర్‌టీ ఉంటుందని పేర్కొన్నారు. గతంలో కంటే ఈ సారి ఎక్కువ మందికి ప్రయోజనం కలిగేలా DSC నిర్వహిస్తామని మంత్రి గంటా హామీ ఇచ్చారు.
DSC షెడ్యూల్ ఇదే :
* అక్టోబరు 26న నోటిఫికేషన్
* నవంబరు 1 నుంచి 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
* నవంబరు 29 నుంచి హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
* నవంబరు 17న నుంచి ఆన్‌లైన్‌లో మాక్ టెస్ట్ నిర్వహణ
* డిసెంబర్ 6, 10 తేదీల్లో స్కూలు అసిస్టెంట్ రాత పరీక్ష
* డిసెంబర్ 12, 13న పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్ రాత పరీక్ష
* డిసెంబర్ 14, 26న టీచర్స్ గ్రాడ్యుయేట్ టీచర్స్, ప్రిన్సిపల్స్ రాత పరీక్ష
* డిసెంబర్ 17 పీఈటీ, మ్యూజిట్, క్రాప్ట్ అండ్ ఆర్ట్స్, డ్రాయింగ్ రాత పరీక్ష