AP Municipal Elections 2021 Results Live YSRCP wins 9 municipalities still now: నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టింస్తోంది. ఇప్పటిదాకా వెలువడిన ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ ముందంజలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు నగరపాలక సంస్థ, కుప్పం సహా 12 మున్సిపాలిటీలతో పాటు సోమవారం పోలింగ్ జరిగిన అన్ని చోట్ల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇందులో ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 9 మున్సిపాలిటీలను అధికార పార్టీ వైఎస్సార్సీపీ (YSRCP) కైవసం చేసుకుంది. టీడీపీ అధినేత ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం మున్సిపాలిటీతో సహా ఆకివీడు, పెనుకొండ, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, గురజాల, బుచ్చిరెడ్డిపాలెం, దాచేపల్లిలో వైఎస్సార్సీపీ విజయ ఢంకా మోగించింది. ప్రకాశం జిల్లా దర్శిలో మాత్రం టీడీపీ (TDP) గెలుపొందింది.
నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో (Nellore Municipal Corporation) 54 డివిజన్‌లు ఉండగా 8 డివిజన్‌లు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. ఇక మిగిలిన 46 డివిజన్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఆయా డివిజన్లలో పోలైన ఓట్లు లెక్కించడానికి 142 టేబుళ్లను ఏర్పాటు చేశారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు సాగుతోన్న ప్రక్రియన వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ, సీసీ కెమెరాల ద్వారా రికార్డ్ చేస్తున్నారు.
Also Read : కలల జ్యోతిషశాస్త్రం: పదే పదే మరణించిన వారు కలలో కనపడుతున్నారా..?? దానికి అర్థం ఇదే!
నెల్లూరు కార్పొరేషన్ (Nellore Corporation) ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ హవా నడుస్తోంది. ఎన్నికలు జరిగిన 46 డివిజన్లలో.. ఇప్పటిదాకా ఒక రెండు డివిజన్లలో తప్ప వైఎస్సార్సీపీ అన్ని డివిజన్లలో విజయం సాధించింది. మొత్తానికి నెల్లూరు కార్పొరేషన్‌లో క్లీన్‌స్వీప్ దిశగా వైఎస్సార్‌సీపీ దూసుకెళ్తోంది.ఇక ఆయా మునిసిపాలిటీల్లో (municipalities)325 డివిజన్లు, వార్డులకు సోమవారం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 325 స్థానాలకు 1,206 మంది అభ్యర్థులు పోటీపడ్డారు.
Also Read : మున్సిపల్ ఫలితాలు : కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఉద్రిక్తత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook