AP RGUKT IIIT Exams 2020 Postponed | ఆంధ్రప్రదేశ్ లో నివర్ తుపాను గమనించి రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ ప్రవేశ పరిక్షలను వాయిదా వేశారు. ఈ మేరకు RGUKT కన్వీనర్ డి హరి నారాయణ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం రోజు జరగాల్సిన IIIT పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. పరీక్షలు నిర్వహించేందుకు సరైనా వాతావరణం లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
Also Read | SBI Recruitment 2020: భారీగా ఉద్యోగాలకు SBI నోటిఫికేషన్, పూర్తి వివరాలు
నివర్ (Nivar) తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని గమనించి RGUKT పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. శనివారం జరగాల్సిన పరీక్షలను డిసెంబర్ 5న నిర్వహిస్తాం అని తెలిపింది వర్సిటీ. అయితే హాల్ టికెట్లు, పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి మార్పు ఉండదు అని యూనివర్సిటీ తెలిపింది. ఈ పరీక్షలకు హాజరు కావాలి అనుకుంటున్న విద్యార్థులు కనీసం రెండు గంటల ముందే పరీక్షా కేంద్రానికి రావలి అని సూచించారు. వారితో పాటు గుర్తింపు కార్డు తీసుకురావాలని తెలిపారు.
నివర్ తుపాను వల్ల ఆంధ్రప్రదేశ్ లోని (Andhra Pradesh) పలు జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తం అయింది. ముఖ్యంగా రాయలసీమలోని చిత్తూరు, కడప జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తుపాను ప్రభావం కనిపించింది. అనేక జిల్లాల్లో పంట నష్టం జరిగింది. చిత్తూరు, కడపలో కొంత మంది మరణించారు.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR
AP RGUKT CET 2020: రాజీవ్ గాంధీ వర్సిటీ ఐఐఐటి, ప్రవేశ పరిక్షలు రద్దు