AP TET 2022: ఆంధ్రప్రదేశ్‌లో టెట్ (Teacher Eligibility Test) పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆగస్టు 6 నుంచి 21 వరకు టెట్ పరీక్ష నిర్వహించనున్నారు. 2018లో తొలిసారిగా ఆన్లైన్ విధానంలో టెట్ పరీక్ష నిర్వహించగా.. ఈసారి కూడా ఆన్లైన్ విధానంలోనే పరీక్ష జరగనుంది. ఉదయం 9.30 గం. నుంచి మధ్యాహ్నం 12 గం. వరకు, మధ్యాహ్నం 2.30 గం. నుంచి సాయంత్రం 5 గం. వరకు రెండు సెషన్లలో పరీక్ష జరుగుతుంది. టెట్ హాల్ టికెట్లను ఇప్పటికే అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
ఈసారి పరీక్షా కేంద్రాలను హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఒడిశాల్లో కూడా ఏర్పాటు చేయడం గమనార్హం. పొరుగు రాష్ట్రాల్లో ఉండే ఏపీ విద్యార్థుల కోసం ఈ వెసులుబాటు కల్పించారు. టెట్‌లో అర్హత సాధించాలంటే ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం, బీసీలకు 50 శాతం, ఓసీలకు 60 శాతం మార్కులు రావాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు ఇదివరకు టెట్ పేపర్-2ఏ రాయాలంటే డిగ్రీలో 45 శాతం మార్కులు ఉండటం తప్పనిసరి. కానీ ఈ ఒక్కసారికి ఆ మార్కులను 40 శాతానికి కుదించారు.
గతంలో టెట్ పరీక్ష రాస్తే అది కొన్నేళ్ల పాటు మాత్రం వాలిడ్ అయ్యేది. కానీ ఈసారి టెట్‌లో అర్హత సాధిస్తే ఇక జీవితాంతం చెల్లుబాటు అవుతుంది. టెట్ పరీక్ష ప్రాథమిక 'కీ'ని ఆగస్టు 31న విడుదల చేస్తారు. సెప్టెంబర్ 7 వరకు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 12న ఫైనల్ కీ విడుదల చేస్తారు. సెప్టెంబర్ 14న ఫలితాలు వెల్లడిస్తారు. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.
టెట్ అభ్యర్థులకు కీలక సూచనలు :
అభ్యర్థులు టెట్ హాల్ టికెట్‌తో పరీక్షా సమయానికి కాస్త ముందుగానే పరీక్షా కేంద్రం వద్దకు చేరుకోవాలి. చివరి నిమిషంలో పరీక్షా కేంద్రం వద్దకు వెళ్తే అనవసరంగా కంగారు పడాల్సి వస్తుంది.
పరీక్షా కేంద్రంలోకి మొబైల్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనుమతించరు.
పరీక్ష సమయంలో మధ్యలో బయటకు అనుమతించరు. పరీక్షా సమయం పూర్తయ్యాకే పరీక్షా కేంద్రం నుంచి పంపిస్తారు.
అభ్యర్థులు బాల్ పాయింట్ పెన్ తీసుకెళ్లాలి.
ఓఎంఆర్ షీట్‌ను మలవడం, కొట్టివేతలు చేయడం, చింపివేయడం చేయవద్దు.
Also Read: RBI Repo Rate Hike: మరోసారి రెపో రేటును పెంచిన ఆర్బీఐ... బ్యాంకు రుణాలపై పెరగనున్న వడ్డీ భారం
Also Read: Venus Transit 2022: మరో 48 గంటల్లో ఈ 5 రాశుల వారికి శుభకాలం మొదలు.. ఇక పట్టిందల్లా బంగారమే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook